HomedevotionalHoroscope Today: 23-09-2022 శుక్రవారం రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆర్ధికంగా మంచి లాభాలు పొందుతారు..!

Horoscope Today: 23-09-2022 శుక్రవారం రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆర్ధికంగా మంచి లాభాలు పొందుతారు..!

Telugu Flash News

Horoscope Today:

23-09-2022 శుక్రవారం రాశి ఫలాలు

మేష రాశి ఫలితాలు: ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రతి విషయంలోనూ మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఇంట్లోని కొంద‌రి ఆరోగ్య విష‌యంలో ఆందోళ‌న త‌ప్ప‌దు. ప్రభుత్వ పనుల్లో విజయం సాధించే అవ‌కాశం ఉంది.

వృషభ రాశి ఫలితాలు: ఈ రాశి వారికి తండ్రి వైపు నుంచి లాభం ఉంటుంది. విద్యార్థులు చదువుపై ఆసక్తిని పెంచుకుంటారు. పిల్ల‌ల విష‌యంలో డ‌బ్బు కాస్త ఎక్కువ ఖ‌ర్చు అవుతుంది. ఈరోజు ఆస్తికి సంబంధించిన ఎలాంటి పనులు చేయక‌పోవ‌డం మంచిది.

మిథున రాశి ఫలితాలు: ఈ రాశి వారు కొత్త ప‌నుల‌ని ప్రారంభిస్తారు. అలానే వేగేంగా మారుతున్న ఆలోచ‌న‌ల‌తో గంద‌ర‌గోళ‌లంలో ప‌డిపోతారు. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారితో సత్సంబంధాలు మంచిగా ఉంటాయి. ఆర్ధికంగా మంచి లాభాలు పొందుతారు.

కర్కాటక రాశి ఫలితాలు: ఈ రాశి వారికి నేడు కొంత చిరాకుగా ఉంటుంది. కుటుంబ స‌భ్యుల‌తో కాస్త వైరం నెల‌కొనే అవ‌కాశం ఉంది. ఎక్కువ‌గా ధ‌నం ఖ‌ర్చు అవుతుంది. విద్యార్థుల మనస్సు చదువులో నిమగ్నం కాదు. అసంతృప్తి భావన వల్ల మనసు ఆందోళన చెందే అవ‌కాశం ఉంది.

సింహ రాశి ఫలితాలు: ఈ రాశి వారికి నేడు కొంత క‌లిసి వ‌స్తుంది. తండ్రి లేదా పెద్దల నుంచి ప్రయోజనం పొందగ‌లుగుతారు. ఆరోగ్యం విషయంలో ఆందోళ‌న చెందుతారు. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని అనుభవిస్తారు. ప్రభుత్వ పనులు త్వరలో పూర్తి అవుతాయి.

-Advertisement-

కన్య రాశి ఫలితాలు: మీరు శారీరక, మానసిక ఆందోళన చెందుతారు. అహంభావం వల్ల కొంద‌రితో గొడ‌వ‌లు ప‌డ‌తారు. ధనం బాగానే ఖర్చు అవుతుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్ప‌డతాయి. మానసిక, శారీరక ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది.

తుల రాశి ఫలితాలు: ఇంట్లో ఆనందం మెండుగా ఉంటుంది. కార్యాలయ, వ్యాపార రంగంలో అనుకూల వాతావరణం నెల‌కొని ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది

వృశ్చిక రాశి ఫలితాలు: ఈ రోజు వారి ఇంట్లో ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. వ్యాపారంలో మంచి అవకాశాలు లభించ‌డంతో పాటు ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

ధనుస్సు రాశి ఫలితాలు: ఈరోజు వేనే వేసే స్టెప్స్ మిమ్మ‌ల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కొన్ని ప‌నుల వ‌ల‌న‌ శారీరకంగా, మానసికంగా ఆందోళన చెందుతారు. కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగి నష్టపోతారు. కాస్త ప్ర‌త్య‌ర్ధుల‌తో జాగ్ర‌త్త‌గా ఉంటే మంచిది.

మకర రాశి ఫలితాలు: ఈ రోజు మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. ఆకస్మికంగా డబ్బు ఖర్చు అవ‌డం, వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు పెరుగుతాయి. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

కుంభ రాశి ఫలితాలు: ఈ రోజు మీరు ప్రయాణాలు ఎక్కువ‌గా చేస్తారు. ఫ్యామిలీతో స‌ర‌దాగా ఉంటారు. ప్ర‌జ‌ల‌లో గౌరవం పొందగ‌లుగుతారు. బలమైన విశ్వాసంతో మీ పనిలో విజయం సాధించ‌గ‌లుగుతారు. ఈ రోజు మీకు అదృష్టం మెండుగా ఉంటుంది.

మీన రాశి ఫలితాలు: ఈ రాశి వారు చేప‌ట్టే ప‌నులు స‌క్ర‌మంగా జ‌రుగుతాయి. కోపం కాస్త అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. మీ ప్రత్యర్థులపై విజయం సాధించ‌గ‌లుగుతారు.. సహోద్యోగుల సహకారంతో మీ పని సులువు అవుతుంది.. అమ్మానాన్నల వల్ల లాభం ఉంటుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News