సున్నిత మనస్కులు సినీ రంగంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాము అంటేనే అందం, నటన,టాలెంట్ తో పాటుగా గట్స్ కూడా ఉండాలి.మనకు సంబంధించి ఎన్నో ప్రచారాలు నడుస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగాలి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం క్రియేట్ చేసారు ఎన్టీఆర్.
సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటుడుగా నిలిచారు. 1923 మే 28 జన్మించిన ఆయన మన దేశం సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వగా, ఆయన్ను హీరోగా నిలబెట్టిన సినిమాలు చంద్రహారం,పాతాళభైరవి, మాయాబజార్ అని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ చివరిగా మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రాలలో నటించారు.
అయితే అప్పటి నటీనటుల మధ్య మంచి స్నేహ బంధం ఉండేది. సీనియర్ నటులను హీరోయిన్స్ బాబాయి గారు అని ఆప్యాయంగా పిలుస్తూ ఉండేవారు. నటులందరూ అప్పట్లో ఒక కుటుంబంగా బ్రతికారు. నందమూరి తారకరామారావు పెద్ద స్టార్ అయినప్పటికీ ఆయన కూడా ఇదే పద్ధతి పాటించేవారట.
సెట్ లో ఉన్న నటులు, హీరోయిన్స్ తో చాలా ఆప్యాయంగా, ఉంటూ ఒక హీరోయిన్ ని అయితే కోడలా అని పిలిచేవారట. ఆమె ఎవరో కాదు ఎన్టీఆర్ తో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఎస్ వరలక్ష్మి. ఈ సీనియర్ హీరోయిన్ ఒక సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది.
నర్తనశాల మూవీలో ఎన్టీఆర్ బృహన్నల పాత్ర చేయగా, ఆ మూవీలో నేను ఆయనకు కోడలిగా నటించాను. అప్పటి నుండి ఆయన నన్ను కోడలా అని సరదాగా పిలిచేవారు. ఎన్టీఆర్ అంతటి స్టార్ అలా ఆప్యాయంగా పిలుస్తుంటే ఆ ఆనందం వేరుగా ఉండేది.
ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరు కాగా, ఆయన నుండి అనేక మంచి విషయాలు నేర్చుకున్నాను. పెద్ద స్టార్ అన్న భావన ఆయనలో అస్సలు ఉండదు. అందరితో సరదాగా కలిసిపోయేవారు. ఎన్టీఆర్ తో నేను నర్తనశాల, పరమానందయ్య శిష్యులు, మంగమ్మ శపథం, పాండవ వనవాసం, రాముడు భీముడు ఇలా అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించాను అని సీనియర్ హీరోయిన్ వరలక్ష్మీ చెప్పుకొచ్చింది.
also read news: