Telugu Flash News

Senior actress Jamuna Passed Away న‌టి జ‌మున క‌న్నుమూత‌

Senior actress Jamuna passed away

Senior actress Jamuna passed away

Senior actress Jamuna : ఇటీవ‌ల టాలీవుడ్‌లో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం కృష్ణ‌, కృష్ణంరాజు, కైకాల వంటి వారు మృతి చెంద‌గా కొద్ది సేప‌టి క్రితం జ‌మున కన్నుమూసారు.

Senior actress Jamuna passed awayసినిమా రంగంలో ఆమె స్థానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తొలి గ్లామర్ హీరోయిన్..నటనలో ఓ చిలిపితనం..సొగసుదనం..గడుసుతనం అన్నీ తొంగి చూసేవి. ఏ పాత్ర వేస్తే అందులోకి పరకాయ ప్రవేశం కామన్.

నటిగా అది ఆమె స్టామినా. అలాంటి జమున తన 87వ ఏట కన్నుమూసారు. తొలితరం హీరోలు అందరి సరసన అన్ని రకాల పాత్రలు ధరించిన జ‌మున‌.. హీరోలతో సమానమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు.

Senior actress Jamuna passed away

వయసు మీద పడిన తరువాత కూడా ఎక్కడ ఏ ఫంక్షన్ లో కనిపించినా హుషారుగానే క‌నిపించేవారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున ఇంటికే పరిమితం అయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆమె ఈ ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

వెండితెరపై గడసరి అచ్చతెలుగు ఆడపిల్లలా ఆమె సినీ ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. మహానటి సావిత్రితో కలసి హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు.

జమున 1936లో హంపిలో జన్మించారు.ఆమె 1953లో పుట్టిల్లు చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. రాజ‌కీయాల‌లోను త‌నదైన ముద్ర వేశారు జ‌మున‌.

also read :

Thyroid : ఈ 5 ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్‌ నుంచి ఉపశమనం గ్యారెంటీ !

Lawyer : కర్ణాటకలో సంచలనం.. లాయర్‌ పేరుతో అతడు చేసే పనులు చూస్తే విస్తు పోవాల్సిందే!

Exit mobile version