Telugu Flash News

Chalapathi Rao : సీనియర్ నటుడు చలపతిరావు ఇక లేరు !

senior actor chalapathi rao passed away

Chalapathi Rao : టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినిమా తొలి తరం నటీనటులు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. రెండు రోజుల క్రితం నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ అనంతలోకాలకు చేరుకున్నారు. ఈరోజు సీనియర్ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు రవిబాబు, కుమార్తెలు మాలినీదేవి, శ్రీదేవి ఉన్నారు.

చలపతిరావు 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించారు. 1966లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘గూఢచారి 116’ సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. సహాయ నటుడిగా, విలన్‌గా, హాస్యనటుడిగా 12 వందలకు పైగా చిత్రాల్లో నటించారు. మహానటుడు ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో వెండితెరపై మెరిశారు.

నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సమర్పణలో కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరెళ్ల పంట, ప్రెసిడెంట్ గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి వంటి సినిమాలు వచ్చాయి. చాలా టీవీ సీరియల్స్‌లో నటించాడు. ఆయన కుమారుడు రవిబాబు విలక్షణ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమలో ఆయనను బాబాయి అని ముద్దుగా పిలుచుకుంటారు.

also read news: 

Rewind 2022 : ఈ ఏడాది దివికేగిన సినీ తారలు

 

Exit mobile version