Selvaraghavan: ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలని తెరకెక్కించిన డైరెక్టర్ సెల్వరాఘవన్ అందరికి గుర్తుండే ఉంటుంది. 7/G బృందావన్ కాలనీ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. దానికి సీక్వెల్ చేయబోతున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాని ఎలాంటి క్లారిటీ లేదు. చివరిగా ధనుష్ ద్విపాత్రాభినయంలో ‘నానే వరువెన్’ సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కించారు. అప్పటి నుండి సినిమాలే చేయడం లేదు.
‘తుళ్లువదో ఇలామై’తో దర్శకుడిగా పరిచయమైన సెల్వరాఘవన్ తొలి చిత్రంతోనే భారీ హిట్ కొట్టారు. అయితే ఆ సినిమాలోని ఫొటోను షేర్ చేసిన ఓ అభిమాని..’ఈ సినిమా దర్శకుడు చనిపోయినట్లున్నారు. లేదంటే సినిమాలు తీయడం ఆపేసైనా ఉండాంటూ ట్వీట్ చేయగా, దీనికి సెల్వరాఘవన్ స్పందిస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మై ఫ్రెండ్.. నేను చనిపోలేదు.. అలానే సినిమాల నుండి కూడా రిటైర్ కాలేదు. కొంత విశ్రాంతి తీసుకుంటున్నాను. నేను ఇంకా నలభైలలో మాత్రమే ఉన్నాను. ఐ యామ్ బ్యాక్ అంటూ అభిమానికి దిమ్మతిరగే రిప్లై ఇచ్చాడు. వీరి సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని చదవండి :
Rama Banam movie review : ‘రామబాణం’ మూవీ రివ్యూ .. గోపిచంద్ ఖాతాలో హిట్ పడ్డట్టేనా..!
Ugram Telugu movie review :’ఉగ్రం’ తెలుగు మూవీ రివ్యూ … అల్లరోడు హిట్ కొట్టినట్టేనా..!