Telugu Flash News

సికింద్రాబాద్‌-విశాఖ వందే భారత్‌ ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే.. చార్జీలు, రైలు విశేషాలివే..

vande bharat express

vande bharat express

సంక్రాంతి కానుకగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను అందించినట్లు వెల్లడించారు. రేపటి నుంచి ఈ రైలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ ఫాం నంబర్‌ 10 నుంచి ఈ రైలు ప్రారంభమైంది. సోమవారం నుంచి వారంలో ఆరు రోజులపాటు విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖ మధ్య నడవనుంది. టికెట్‌ ధరలు, వందే భారత్‌ ఆగే స్టేషన్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైల్లో టికెట్‌ రిజర్వేషన్లు అప్పుడే మొదలయ్యాయి. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ బయల్దేరే రైలు 20833 నంబర్‌తో, సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్లే రైలు 20834 నంబర్‌తో ప్రయాణం చేస్తాయి.

రోజూ ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటల కల్లా సికింద్రాబాద్ చేరుకుంటుంది. అంటే సరిగ్గా 8 గంటల్లో చేరుకోవచ్చు. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో రైలు ఆగుతుంది.

మరోవైపు వందే భారత్ ట్రైన్ లో టిక్కెట్ ధరలు ఖరారు చేసింది రైల్వేశాఖ. ఛైర్ కార్‌లో ప్రయాణానికి 1,720 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణానికి 3,170 రూపాయలుగా పెట్టారు. వందే భారత్‌లో ఏసీతో పాటు నాన్ ఏసీ బోగీల్లో కలిపి మొత్తం 1,128 మంది ప్రయాణించే వీలుంది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు చైర్‌ కార్‌ ధర 520 రూపాయలు, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ధర 1,005గా ఐఆర్‌సీటీసీ నిర్ధారించింది. బుకింగ్‌ సమయంలో ఆహారం తీసుకోవాలా, వద్దా అనేది ప్యాసింజర్‌ ఇష్టం.

వందే భారత్‌ గరిష్ట వేగం 160 కిలోమీటర్లు..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బయట ఏరోడైనమిక్ డిజైన్‌తో ఉంటుంది. వందే భారత్ కోచ్‌లు ఇతర రైళ్ల కంటే తేలిగ్గా ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది. దీంతో స్పీడ్ కెపాసిటీ పెరుగుతుందని పేర్కొంది. వందే భారత్ గరిష్ఠ వేగం గంటకు 160 కిలోమీటర్లు. అత్యాధునిక సస్పెన్షన్ సిస్టమ్‌తో జర్నీ కుదుపులు లేకుండా చాలా స్మూత్ గా సేఫ్ గా ఉంటుందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.

also read:

పవన్‌ కల్యాణ్‌ టార్గెట్‌ అదేనా? ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో క్లారిటీ ఇచ్చేశారా?

బొన్నీ గాబ్రియేల్‌ : మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కించుకున్న అమెరికా అందగత్తె

Exit mobile version