HomecinemaAllu arjun :అల్లు అర్జున్ అమ్మ‌వారి వేషం వెన‌క ఉన్న అస‌లు సీక్రెట్ ఇదే.!

Allu arjun :అల్లు అర్జున్ అమ్మ‌వారి వేషం వెన‌క ఉన్న అస‌లు సీక్రెట్ ఇదే.!

Telugu Flash News

Allu arjun:అల్లు అర్జున్ బర్త్ డే పురస్కరించుకుని ఇటీవ‌ల విడుదల చేసిన టీజర్ ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంది అని చెప్పాలి. పుష్ప ఏమయ్యాడనే సస్పెన్సు తో మొదలైన టీజర్ హీరో గూస్ బంప్స్ ఎంట్రీతో ముగిసింది. ఇక‌ టీజర్ కి మించి ఫస్ట్ లుక్ ఆసక్తి రేపగా, ఇందులో ఉగ్రరూపం దాల్చిన అమ్మవారిగా అల్లు అర్జున్ చేతిలో గన్ పట్టుకొని స‌రికొత్త లుక్ లో క‌నిపించాడు.

Pushpa 2 : పుష్ప‌2 లో బ‌న్నీతో ర‌చ్చ చేయ‌బోతున్న హనీ రోజ్..

అయితే ఈ లుక్ వెన‌క సీక్రెట్ ఏంట‌ని అనేక చ‌ర్చ‌లు సాగుతున్న స‌మ‌యంలో ఓ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అమ్మ‌వారి గెటప్ లో అల్లు అర్జున్ ఓ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటాడట. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఈ యాక్షన్ సన్నివేశం సినిమాకే హైలెట్ అవుతుంద‌ని అంటున్నారు. గంగమ్మ జాతర కోసం అల్లు అర్జున్ అమ్మవారి అవతారం ధరిస్తాడని, దర్శకుడు సుకుమార్ ఆ జాతరలో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాన్ చేసిన‌ట్టు కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి.

అలా అమ్మోరి గెటప్ వేయడం స్థానికంగా ఉండే ఆచారం ప్ర‌కారం జరిగింద‌ని చెప్పుకొస్తున్నారు. ఓ విలన్ ని చంపేందుకు ఈ సెటప్ అండ్ గెటప్ ప్లాన్ చేశాడట సుక్కూ. ఒకప్పటి పాలెగాడి షేడ్స్ ఉన్న విలన్ ని చంపేందుకు హీరో అల్లు అర్జున్ తనను గుర్తు పట్టకుండా ఉండేదుకు ఆ జాతరకు మగాళ్లు మొక్కుబడిగా ధరించే అమ్మోరు వేషధారణలోకి మారతాడని అంటున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News