Sarath Babu : 1981, 88, 89 సంవత్సరాలలో వరుసగా మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్న శరత్ బాబు హీరోగా,పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. ఏడు పదుల వయస్సులోను సినిమాలు చేస్తున్న శరత్ బాబు.. సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్న మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తుండగా, ఆ సమయంలో అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలయ్యారు.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం శరత్ బాబును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నరు. అయితే రెండు రోజులుగా ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించిందని శరీరం మొత్తానికి ఇన్ఫెక్షన్ వ్యాపించిందని డాక్టర్స్ చెబుతున్నారు.
ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు పాడైనట్లు వారు స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి దారి తీసే అవకాశం ఉందని తెలియజేశారు. ప్రస్తుతం శరత్ బాబును వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తుండగా, కొన్ని గంటలు గడిస్తేనే గానీ ఆయన ఆరోగ్యంపై ఓ క్లారిటీ ఇవ్వలేమని వైద్యులు అంటున్నారు.
Sarath Babu : ఆసుపత్రిలో శరత్ బాబుకి చికిత్స.. ఏం జరిగింది..!