Sarath Babu: తెలుగు , తమిళం, కన్నడ ఇలా పలు భాషలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శరత్ బాబు మే 22 మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో కన్నుమూసారు. దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఆయన పరిస్థితి విషమించడంతో.. శరత్ బాబు తుదిశ్వాస విడిచారు.
ముందుగా ఆయన అనారోగ్యంతో చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకోగా, అక్కడ పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. బెంగళూరుకి తరలించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే శరత్ బాబు చనిపోయారని న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దానిపై శరత్ బాబు సోదరి స్పందిస్తూ ఆయన చనిపోలేదని, బాగానే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి శరత్ బాబు పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలిసింది.
గత కొంతకాలం నుండి శరత్ బాబు వయసు క్రమేపీ పెరగడంతో శరీరం మొత్తం సెప్సిస్ కావడం జరిగింది. ఊపిరి తిత్తులు, కాలేయంతో పాటు కిడ్నీ వంటి ప్రధాన అవయవాలు కూడా పూర్తిగా చెడిపోయాయి. అయితే శరత్ బాబు ఇలా చనిపోవడానికి కారణం ఆయన తరచూ డాక్టర్ చెకప్ చేయించుకోకపోవడమే అని ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.
ముందుగానే ఆయన రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉండి ఉంటే ఇంత సీరియస్ అయ్యేది కాదని, శరీరం లోని ప్రధాన అవయవాలు దెబ్బ తినే స్థాయి వరకు వచ్చేది కాదని అంటున్నారు. మొదట్లో ఆయన ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదని, అదే ఆయన చేసిన ఈ పొరపాటు అని, దాని వలన ప్రాణాలు పోగొట్టుకున్నారని చెబుతున్నారు.
నటుడిగా సక్సెస్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేసిన శరత్ బాబుకి.. పర్సనల్ లైఫ్.. మారీడ్ లైఫ్ లో మాత్రం అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న కూడా ఆయనకు పిల్లలు లేరు. కాని శరత్ బాబు మాత్రం తన సోదరుల బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా చూసుకున్నారు. ఇక ఆస్తిపాస్తులు మాత్రం బాగానే సంపాదించినట్టు తెలుస్తుంది.
హైదరాబాద్, చెన్నై , బెంగళూర్ వంటి ప్రాంతాలలలో శరత్ బాబుకి ఇళ్లూ, స్థలాలూ, షాపింగ్ మాల్స్ చాలనే ఉన్నాయట.. దాంతో వాటి గురించే ప్రస్తుతం తగాదాలు స్టార్ట్ అయినట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. గత కొంత కాలంగా ప్రైవేట్ ఆసుపత్రిలో లో ట్రీట్మెంట్ తీసుకున్న శరత్ బాబు హాస్పిటల్ ఖర్చులన్నీ బందువులే భరించారట.
ఆయన కోలుకొని.. మళ్లీ తమకు మిగిలిన ఆ ఆస్తి కూడా రాసిస్తారన్న ఆశతో వారు ఉండగా, ఇప్పుడు ఆయన మరణంతో.. కుటుంబంలో గొడవలు ఇంకా పెద్దవి అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆసుపత్రి బిల్లులన్నీ ఎవరు భరిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
also read :