Telugu Flash News

Sanju Samson: ఆ క్రికెట‌ర్‌నే బ‌లి ప‌శువుని చేస్తున్నారా.. ఆట ఆడ‌కున్నా మ‌నసులు గెలుచుకున్న సంజూ

sanju samson

Sanju Samson: ఇప్పుడు టీమిండియా న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ ఆడుతున్న విష‌యం తెలిసిందే. తొలి వ‌న్డే దారుణంగా ఓడిపోగా, రెండో వ‌న్డే వ‌ర్షార్పణం అయింది. అయితే టీమ్ సెల‌క్ష‌న్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది. సంజూ శాంస‌న్ లాంటి మంచి బ్యాట్స్ మెన్ కి టీ 20లో చోటు ఇవ్వ‌క‌పోగా, వ‌న్డేల‌లో కూడా మొండి చేయి ఇస్తున్నారు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌లలో సంజూ చక్కగా రాణించిన‌ టీ20 సిరీస్‌లో అవకాశం ఇవ్వలేదు. చివరకు వన్డేలో ఒకే ఒక అవకాశం ఇవ్వ‌గా, అందులో 36 పరుగులు చేసిన సంజూ.. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం కూడా నెలకొల్పాడు. అయిన‌ప్ప‌టికీ రెండో వన్డేలో అతనికి జట్టులో చోటు దక్కలేదు.

సంజూ స్థానంలో హుడాను తీసుకున్నారు.. ఈ వార్త అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. జట్టులో ఎవరు ఆడకపోయినా మేనేజ్‌మెంట్ మాత్రం సంజూనే బలిపశువును చేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పంత్ ఆడ‌క‌పోయిన అత‌నికే ప‌దే ప‌దే అవకాశాలు ఎందుకు ఇస్తున్నారంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సంజూ శాంస‌న్‌కి వ‌రుస‌గా 10 మ్యాచ్‌ల ఛాన్స్ ఇస్తే అత‌ని టాలెంట్ బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ర‌విశాస్త్రి కూడా అన్నాడు. ప్ర‌తి సారి సంజూ శాంస‌న్‌ని బ‌లి ప‌శువుని చేయ‌డం ఏ మాత్రం బాగోలేదంటూ అభిమానులు కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఇక టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు రెండో మ్యాచ్ ప్లేయింగ్ 11లో చోటు దక్కక‌పోవ‌డంపై శిఖ‌ర్ స్పందిస్తూ… ఆరో బౌలర్‌ ఆప్షన్‌ కోసం శాంసన్‌ బదులు ఆల్‌రౌండర్‌ దీపక్ హుడాను జట్టులోకి తీసుకొన్నాం అని స్పష్టం చేశాడు. అయితే సంజూ మ్యాచ్‌లో భాగం కాకపోయినా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. తొలుత వర్షం తగ్గుముఖం పట్టాక గ్రౌండ్‌ స్టాప్‌ మైదానం సిద్దం చేసే పనిలో ఉండ‌గా, ఈ క్రమంలో గ్రౌండ్ స్టాఫ్ కవర్లను పట్టుకునేందుకు ఇబ్బంది పడుతుండగా.. శాంసన్‌ సిబ్బందికి సహాయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

also read news:

ఉపవాసం వల్ల ఆరోగ్యానికి కలిగే 12 అద్భుత ప్రయోజనాలు

Top 10 Amazing fruits and Why You should To Eat

 

Exit mobile version