HomecinemaSamantha: స‌మంత‌పై ప్ర‌శంస‌లు కురిపించిన సానియా మీర్జా.. కార‌ణం ఏంటంటే..!

Samantha: స‌మంత‌పై ప్ర‌శంస‌లు కురిపించిన సానియా మీర్జా.. కార‌ణం ఏంటంటే..!

Telugu Flash News

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌ల అనారోగ్యం నుండి కోలుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది. బాలీవుడ్‌ లో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీ వెబ్‌ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 లో బోల్డ్‌ యాక్టింగ్‌ తో ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేసిన సమంత ప్రస్తుతం మరో హిందీ సిరీస్ లో న‌టిస్తూ థ్రిల్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. మరో వైపు కమర్షియల్ యాడ్స్ ను కూడా చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది.

తాజాగా పెప్సీ కమర్షియల్‌ యాడ్‌ తో ప్రేక్షకుల ముందుకు రాగా, 50 సెకన్లు ఉన్న ఈ కమర్షియల్‌ యాడ్‌ లో డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్ లో విభిన్నమైన పాత్రల్లో సమంత క‌నిపించి థ్రిల్ చేస్తుంది. ఈ క్ర‌మంలో స‌మంత యాడ్‌పై సానియా మీర్జా స్పందించింది. మహిళలు వేసుకునే దుస్తులు, భాగస్వామి ఎంపిక.. ఇలా అన్ని అంశాల్లో అమ్మాయిలపై తమ అభిప్రాయం రుద్దే ప్రయత్నం చేస్తున్న క్ర‌మంలో దీనిని దాటుకొని ఓ అమ్మాయి తనకు నచ్చినట్లుగా జీవించాలనే ఉద్దేశ్యం ఈ యాడ్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. దీనిపై సానియా మీర్జా స్పందించారు. ఈ యాడ్ చూశాక త‌నకి ఎన్నో జ్ఞ‌పాకాలు గుర్తుకు వ‌చ్చాయ‌ని చెప్పింది. స‌మాజాన్ని ప‌ట్టించుకోకుండా ధృడ సంకల్పంతో తాను అనుకున్న‌ది నెర‌వేర్చుకున్న‌ట్టు పేర్కొంది. క‌ల‌లు సాకారం చేసుకోవాల‌ని అనుకునే వారికి ఈ యాడ్ ఎంతో స్పూర్తి అని సానియా పేర్కొంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News