sania mirza farewell match : టెన్నిస్ దిగ్గజం, భారత క్రీడాకారిణి సానియా మీర్జా ఇటీవలే తన ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు అంటే మార్చి ఐదో తేదీన ఆమె తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ను ఆడింది.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగిన ఫేర్‌వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొని నెగ్గింది. సింగిల్స్ విభాగంలో రోహన్ బోపన్నతో జరిగిన మ్యాచ్‌లో సానియా మీర్జా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే సానియా తీవ్ర భావోద్వేగానికి గురైంది.
ఫేర్‌వెల్ మ్యాచ్ అనంతరం సానియా మీర్జా కంటతడి పెట్టుకుంది. ఈ సందర్భంగా సుమారు రెండు దశాబ్దాల తన కెరీర్‌లో ఆటుపోట్లు, మైలు రాళ్లను, ఇతర సంఘటనలను సానియా నెమరు వేసుకుంది. ఈ మ్యాచ్‌లో సానియా కుమారుడు అమ్మా గ్రేట్.. అంటూ తన ప్రేమను చూపించాడు.
దీంతో స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో అభినందనలు వెల్లువెత్తాయి. తర్వాత సానియా మీర్జా మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రోహన్ బోపన్నతో జతకట్టనుంది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీతో సానియా, బోపన్న తలపడనున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ ప్లేయర్ ఆఖరి మ్యాచ్‌ను చూసేందుకు ప్రముఖులంతా స్టేడియంకు చేరుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, ఇతర రంగాలకు చెందిన ప్రముకులు, సెలబ్రిటీలు వచ్చారు.
ఎల్బీ స్టేడియంలో సందడి వాతావరణం ఏర్పడింది. టీమిండియా మాజీ క్రికెటర్లు అజారుద్దీన్, యువరాజ్ సింగ్, సినీ నటుడు, సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ తదితరులు స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇక కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ సాయంత్రం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయనతోపాటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు మరికొందరు క్రీడా, సినీ ప్రముఖులు ఈ సాయంత్రం ప్రైవేట్ హోటల్‌లో జరిగే స్పెషల్ ఈవెంట్‌లో పాల్గొననున్నారు.
సానియా మీర్జా సుమారు రెండు దశాబ్దాల తన కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు, 43 డబ్ల్యూటీఏ టైటిల్స్, ఏసియన్ గేమ్స్‌లో ఎనిమిది పతకాలు, కామన్‌వెల్త్ క్రీడల్లో రెండు మెడళ్లు సాధించింది.
డబుల్స్‌లో 91 వారాల పాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగడం విశేషం. దేశ టెన్నిస్‌లో విలువైన సేవలందించినందుకు సానియాకు ఖేల్ రత్న, అర్జున, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు వరించాయి.
also read :
medico preethi case : అసలు ప్రీతి ఆత్మహత్య ఘటనలో ఏం జరిగింది? కీలక అనుమానాలు వెలుగులోకి..
Satvik Suicide Case : సాత్విక్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు!