Chaitanya: ఏప్రిల్ 30 ఆదివారం ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య నెల్లూరు క్లబ్ హోటల్ లో ఆర్థిక బాధలని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మృతిని తోటి డ్యాన్సర్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. చైతన్య మృతి బుల్లితెర వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఆట సందీప్ తాజా ఇంటర్వ్యూలో చైతన్య అప్పులపాలు కావడానికి కారణాన్ని చెప్పుకొచ్చారు. ఢీ లో ఒక పాటకు కొరియోగ్రాఫర్ కి రూ. 30000 ఇస్తున్నారు. ఈ డబ్బులతో డాన్సర్స్ కి కావలసిన కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్, భోజనాలు, ట్రావెలింగ్ చార్జెస్, రెమ్యూనరేషన్ ఇలా అన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
ఒక పాటను కొరియోగ్రాఫర్ చేయడానికి ముప్పై వేలు ఓ మూలకి రావు. కాని పేరు తెచ్చుకునేందుకు బయట అప్పులు చేసి రిచ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ కారణం వల్లనే చైతన్య అప్పులపాలయ్యాడు. జబర్దస్త్ షోలో కమెడియన్స్ కి మంచి రెమ్యునరేషన్స్ ఇస్తున్నా, ఢీ డాన్సర్స్ కి మాత్రం తక్కువ ఇస్తారని సందీప్ చెప్పుకొచ్చాడు. కష్టం అంతా డాన్సర్స్ దే అయినప్పటికీ డాన్సర్స్ ని ఎందుకో చిన్న చూపు చూస్తారు. డబ్బుల విషయంలో బేరసారాలు ఆడతారు. చైతన్య మాదిరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు చాలా మంది ఉన్నారని సందీప్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE