Homecinemaవరుణ్ దావన్ తో కలిసి సమంత భారీ యాక్షన్ సీన్స్..!

వరుణ్ దావన్ తో కలిసి సమంత భారీ యాక్షన్ సీన్స్..!

Telugu Flash News

తెలుగులో యశోద, శకుంతలం చిత్రాలను పూర్తి చేసిన సమంత బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో బిజీ కాబోతోంది. అక్కడ సమంత వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలకు కూడా ఓకే చెప్పింది. రాజ్ , డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్ తో ఓ భారీ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు ఇప్పటికే సామ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ను మించిన భారీ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నారు దర్శక ద్వయం. ఇది హాలీవుడ్ వెబ్ సిరీస్‌కి రీమేక్ అని వార్తలు వచ్చాయి.

ఈ వెబ్ సిరీస్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు రిస్కీ షాట్స్ కూడా ఉండబోతున్నాయి. ఆ యాక్షన్ సన్నివేశాల కోసం వరుణ్ ధావన్, సమంత ట్రైనింగ్ తీసుకోనున్నారు.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. వీరి శిక్షణ ఆగస్టు మూడో వారం వరకు సాగుతుందని తెలుస్తోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడింది. బోల్డ్‌గా నటించడమే కాకుండా చాలా కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది. ఇప్పుడు మరింత యాక్షన్ చూపించేందుకు హీరో వరుణ్ ధావన్ తో కలిసి ట్రైనింగ్ లో పాల్గొననుంది.

సమంతా సుకుమారి మాత్రమే కాదు, కష్టతరమైన వర్కవుట్‌లను సులభంగా కనిపించేలా చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయం చాలాసార్లు చెప్పింది. మరికొన్ని సమంత సౌత్ ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి.

-Advertisement-

మరిన్ని వార్తల కోసం చదవండి:

గొడవలు లేకపోతే ఎందుకు విడిపోయినట్టు.. చై సామ్ విడాకులపై మురళీమోహన్ కామెంట్స్

prabhas : ప్రభాస్ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి – రణబీర్ కపూర్

కాఫీ విత్ కరణ్ షో లో సమంత తన బ్రేకప్ గురించి ఏం చెప్పింది..

బాలీవుడ్ స్టార్ ఏంటీ `పుష్ప 2` టీమ్ ని అలా అనేశాడు?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News