Telugu Flash News

Samantha: స‌మంత‌పై పిచ్చి ప్రేమ‌.. ఏకంగా గుడే క‌ట్టేస్తున్నాడుగా..!

samantha temple

Samantha: సాధార‌ణంగా అభిమానులు హీరోల‌పై తెగ అభిమానం చూపిస్తుంటారు. అయితే ఇటీవ‌ల హీరోయిన్స్ కూడా అభిమానుల గుండెల్లో గూడు క‌ట్టుకుంటున్నారు. తాజాగా ఓ అబిమాని స‌మంత కోసం గుడినే కట్టేస్తున్నాడు.

ఇప్పటివరకు తెలుగులో హీరోయిన్ కోసం ఇలా గుడి కట్టడం ఇదే మొదటి సారి అని చెప్పాలి. బాపట్ల జిల్లా ఆలపాడు జిల్లాకి చెందిన సందీప్ అనే వ్య‌క్తి స‌మంత‌కి వీరాభిమాని. సమంత మీద ఇష్టంతో ఆమెకు తన ఇంటిలోనే గుడిని నిర్మించి ఒక విగ్రహాన్ని నిర్మిస్తండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

ఇంటిలో గుడి కట్టడం అనేది ఇప్పటివరకు ఎక్కడా లేదు. సమంత పుట్టిన రోజు(ఏప్రిల్ 28) న ఈ గుడిని ప్రారంభించనున్నట్టు స‌మాచారం. ఈ విష‌యం తెలిసిన చాలా మంది స‌మంత గుడిని లైవ్‌లో చూసేందుకు క్యూలు క‌డుతున్నారు.

అయితే సమంత మయోసైటీస్ వ్యాధినుంచి కోలుకున్న సందర్భంగా సందీప్ డై హార్డ్ ఫ్యాన్ ఇటీవలే తిరుపతి, చెన్నై నాగపట్నం,కడప దర్గా దైవ క్షేత్రాల్లో సర్వమత మొక్కుబడుల యాత్ర కూడా నిర్వహించాడు. మొత్తానికి గ‌త కొద్ది రోజులుగా తెగ వార్త‌ల‌లో నిలుస్తున్న స‌మంత ఇప్పుడు త‌న గుడి విష‌యంలో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

 

Exit mobile version