Samantha: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత, నాగ చైతన్య విడిపోయి రెండేళ్లు అవుతుంది. ఇంకా వారి విడాకులని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఒంటిపై పలు టాటూలు వేసుకున్న విషయం తెలిసిందే.
నాగచైతన్య ప్రేమకి గుర్తుగా సమంత తన మెడపై, చేతి మడమపై, చెస్ట్ కి కింది భాగంలో పలు టాటూలు వేయించుకుంది. మెడపై తమ తొలి చిత్రం `ఏం మాయ చేశావె`ని గుర్తుండేలా `వైఎంసీ`ని టాటూని వేయించుకుంది.
ఇక చెస్ట్ కి కింది భాగంలో చైతూ పేరుని, చేతి మడమ వద్ద వీరిద్దరి ప్రేమకి సింబల్‌గా ఓ కోడ్‌ని టాటూగా వేయించుకోగా, ఇది చైతూ కూడా వేయించుకున్నాడు. ఈ టాటూలు ఎప్పుడు చర్చనీయాంశం అవుతుంటాయి. అయితే చైతూని వదిలి రెండేళ్లు అవుతున్నా కూడా సమంత.. చైతూ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నట్టు తెలుస్తుంది.
ఇటీవల సమంత లండన్‌లో `సిటాడెల్` ప్రీమియర్ షోలో పాల్గొంది. అక్కడ ట్రెండీ వేర్‌లో మెరవగా, అప్పుడు తన ఒంటిపై నాగచైతన్యకి సంబంధించిన టాటూ కనిపించడం హాట్ టాపిక్ అయింది. సమంత ఇంకా ఆయన్ని మర్చిపోలేకపోతుందని, అందుకే టాటూ చెరిపేయలేదని అంటున్నారు.
also read :
Samantha: సమంత అనారోగ్యం అంతా నాటకమా.. సినిమా కోసం అలా చేసిందా?
Samantha: సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మారతారు.. నేనంతే: సమంత