Samantha: అందాల ముద్దుగుమ్మ సమంత ఇటీవల చాలా కష్టాలను ఎదుర్కొంటుంది. భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంతకు ఒకదాని తర్వాత ఒకటి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇటీవల తాను మయోసైటిస్ అనే ఒక ప్రాణాంతకమైన, అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని వెల్లడించి అందరిని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది.
టాలీవుడ్ లోని బడా హీరోలు సైతం ఆమె అనారోగ్యం నుంచి తిరిగి కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రార్ధించారు. ఇక సమంత నటించిన యశోద చిత్రం నవంబర్ 11న విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్ లో సమంత పాల్గొంటుందా లేదా అనే అనుమానం అందరిలో ఉండగా, తాజాగా ఈ అమ్మడు ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని షాకిచ్చింది.
చావలేదంటూ కామెంట్స్
యాంకర్ సుమతో సమంత ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొనగా, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఇంటర్వ్యూలో తన అనారోగ్య పరిస్థితి గురించి సమంత మరో సారి స్పందించింది. తాను తన అనారోగ్య పరిస్థితి గురించి పోస్టులో పెట్టిన విధంగానే కొన్ని రోజులు మంచి రోజులని కొన్ని రోజులు చెడ్డ రోజులంటూ బాధపడుతూ చెప్పుకొచ్చింది. ఒక్కొక్క రోజు తాను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనని అలా వేస్తే ఇంకా అంతా అయిపోతుంది అనిపిస్తుందని, కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇన్ని దాటి వచ్చానా అని ఆశ్చర్యం వేస్తుందని చెబుతూ కన్నీరు పెట్టుకుంది.
సమంత వ్యాఖ్యలు విన్న తర్వాత సుమా మాట్లాడుతూ మీరంటే నాకు చాలా ఇష్టం, నేను గత కొన్నేళ్లుగా మన ప్రయాణంలో చూస్తూనే ఉన్నాను ఇప్పుడంటే బయటకు చెప్పారు కాని బయటకి చెప్పని సమయంలో కూడా మీరు ఈ వ్యాధితో పోరాడుతూ ఎంత నొప్పి అనుభవించారో నేను ఊహించగలను అని సుమ పేర్కొనగా, జీవితంలో ఎన్నో సమస్యలతో పోరాడే వాళ్ళు ఎందరో ఉన్నారని సమంత ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇక చాలా ఆర్టికల్స్ లో ఒక ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నానని రాశారు కానీ ప్రస్తుతానికి నాకు నేను ఉన్న స్టేజిలో లేను, ఇంకా చావలేదు అంటూ నవ్వేసింది. ఆ హెడ్లైన్స్ అంత అవసరం ఏమీ కాదని ఆమె కామెంట్ చేశారు.
also read :
Bigg Boss 6: ఈ వారం నామినేషన్స్.. టార్గెట్ ఇనయ.. ఇంకా ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..!