Telugu Flash News

Samantha: స‌ల్మాన్, షారూఖ్‌ల‌ని సైతం వెన‌క్కి నెట్టేసిన స‌మంత‌

samantha

samantha

Samantha: స్టార్ హీరోయిన్ స‌మంత క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు బాలీవుడ్ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. దీంతో సిటాడెల్‌తో ఎలా అయిన మంచి హిట్ కొట్టాల‌ని అనుకుంటుంది. ఇందుకోసం చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తుంది.అయితే తాజాగా స‌మంత అరుదైన రికార్డ్ అందుకుంది. ఐఎండీబీ ఇండియన్ స్టార్ సెలబ్రెటీల జాబితాలో సమంత టాప్ ప్లేస్ ద‌క్కించుకుంది.. వరుసగా ఏడు సార్లు ఆర్మ్యాక్స్ ర్యాంకింగ్ లో తొలి స్థానం ద‌క్కించుకున్న‌ సమంత ఈసారి ఐఎండీబీ రేటింగ్ లో సత్తా చాటింది.

నెం.1 స్థానంలో సమంత నిలవగా, బాలీవుడ్ స్టార్స్ సైతం ఆమె త‌ర్వాతే ఉన్నారు. సల్మాన్ ఖాన్ నెం.2 స్థానం, షారుఖ్ ఖాన్ మూడవ స్థానం ద‌క్కించుకున్నారు. శాకుంతలం సినిమా ప్లాప్ అయినా కూడా ఆమెను అత్యంత ప్రతిభ ఉన్న నటిగా సమంత అంద‌రి హృద‌యాలలో స్థానం ద‌క్కించుకుంది. ఈ అమ్మ‌డు ఇటీవ‌ల వ్యక్తిగతం, సినిమా కెరీర్ కారణంగా త‌ర‌చు వార్తల్లో నిలుస్తూ ఉంటున్న విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాలో కూడా సమంత నటిస్తుండ‌గా, ఈ సినిమా కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

also read :

Samantha: టార్చ‌ర్ టైం అంటున్న సమంత‌.. ఐస్ గడ్డల తొట్టెలో అలా కూర్చుందేంటి..!

Samantha: వామ్మో.. స‌మంత ఒక్క సోష‌ల్ మీడియా పోస్ట్‌కి అంత రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నారా.!

Exit mobile version