Samantha :ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ సమంత. కెరీర్‌లో ఎన్నో మంచి చిత్రాలు చేసిన సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా మారింది.
ఇక చైతూతో సినిమాలు చేస్తున్న సమయంలో అతనితో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. కాని ఊహించని విధంగా నాలుగేళ్లకే వారు విడిపోయారు.
అయితే ఇన్నాళ్లు తన విడాకులపై స్పందించని సమంత ఓ ఇంటర్వ్యూలో తొలిసారిగా విడాకులపై స్పందించింది.
వివాహ బంధంలో నేను నిజాయితీగా ఉన్నా గానీ వర్కౌట్ కాలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ అయితే చేసింది.
వివాహ బంధంలో ఎంతో నిజాయితీగా ఉన్నప్పటికీ అది వర్కౌట్ కాకపోవడంతో విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత నాకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది.
ఈ సాంగ్ ఆఫర్ గురించి కొంత మంది నాతో.. విడాకులు తీసుకున్న కొన్ని రోజులకే నీకు ఐటెం సాంగ్స్ ఎందుకు చేస్తున్నావు ఇంట్లో కూర్చోకుండా అంటూ కామెంట్స్ చేశారు.
కాని నేను నాకు నచ్చిందే చేశానంటూ సమంత వ్యాఖ్యానించింది. సమంత నటించిన శాకుంతలం చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది.
also read: