Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొంత కాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటుంది. సమంతకి సంబంధించి కొన్నాళ్లుగా ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. వాటిపై ఈ మధ్య కాలంలో అస్సలు స్పందిచడం లేదు.
తాజాగా సమంత చేసిన ఓ ట్వీట్ అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చింది. అరుదైన వ్యాధి ‘మయోసైటిస్’తో బాధపడుతున్నట్టు స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం వెల్లడించారు. కొన్ని నెలల నుంచి ఆ వ్యాధికి చికిత్స పొందుతున్నట్లు కూడా తెలిపారు.
ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి చాలా సమయం పడుతుందన్నారు.
మయోసైటిస్ వ్యాధి లక్షణాలు ఇవే..
ఇక ఆమె నటించిన ‘యశోద’ సినిమాకు డబ్బింగ్ చెబుతూ.. చేతికి సైలైన్తో ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు. ‘‘నేను మయోసైటి్‌సకు గురైనట్లు కొన్ని నెలల కిందట తెలిసింది. కోలుకున్నాక మీ అందరికీ చెప్పాలని భావించాను. త్వరలో కోలుకుంటానని నమ్మకం కూడా ఉంది’’ అని సమంత తన పోస్ట్‌లో పేర్కొంది..
ఆమె ట్వీట్ చేసిన వెంటనే అభిమానులు, సహ నటులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు సమంత త్వరగా కోలుకోవాలని ఆమె పోస్ట్‌కి బదులు ఇచ్చారు. బాలీవుడ్ నటులు కృతి సనన్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్లతో పాటు తెలుగు హీరోయిన్ రాశీ ఖన్నాకూడా రెస్పాండ్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.
ఈ వ్యాధి వచ్చిన వారికి కండరాల సమస్య ఏర్పడుతుంది. ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లల్లో ఇది వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.
రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకర కణజాలం మీద దాడి చేయడం వల్ల ఈ వ్యాధికి గురవుతారని, దీనిలో పాలి, డెర్మటో, ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్ వంటి పలు రకాలున్నాయంటూ వైద్యులు స్పష్టం చేశారు. ఈ వ్యాధి లక్షణాలు వేగంగా కనిపించవు. ఒక్కోసారి నెమ్మదిగా కూడా కనిపిస్తాయి.
కండరాల నొప్పులు, అలసట, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు.
అమెరికాలో ఏడాదికి 1600-3200 వరకు కొత్త కేసులు వెలుగు చూస్తుంటాయని దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది ప్రజలు మయోసైటిస్‌తో జీవిస్తున్నారని ఓ వెబ్సైట్ పేర్కొంది.
Read more news :