Samantha: ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులని గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ సమంత. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో కుర్రాళ్ల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. కెరీర్ లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది సమంత. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌లలో తన సత్తా చూపిస్తూ అందరు నోరెళ్లపెట్టేలా చేస్తుంది. అయితే కెరీర్ పరంగా సమంత గ్రాఫ్ బాగానే ఉన్నా పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా ఇబ్బందులు పడుతుంది. సిద్ధార్థ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ అమ్మడు కొన్ని కారణాల వలన అతనికి బ్రేకప్ చెప్పింది. ఇక అతని నుండి విడిపోయాక నాగ చైతన్యతో ప్రేమాయణం నడిపింది.
సమంత మంచి మనస్సు..
నాగ చైతన్య- సమంత కొన్నాళ్ల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలాక పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు వీరి సంసారం సజావుగానే సాగిన గత ఏడాది అక్టోబర్ లో విడాకులు తీసుకున్నారు. వీరి నిర్ణయం చాలా మందికి షాక్ ఇచ్చింది. అయితే విడాకులు తర్వాత సమంత సోలో లైఫ్ గడిపేందుకు ఇష్టపడుతుంది.ఏమాత్రం గ్యాప్ దొరికినా కూడా ఆధ్యాత్మిక చింతన వైపు దృష్టి సారిస్తుంది.. క్రిస్టియన్ అయిన కూడా హిందూ ధర్మం పాటిస్తూ పూజలు చేస్తుంది. ఇటీవల సికింద్రాబాద్‌లోని ఒక గురుకులంకు వెళ్లి అక్కడ పూజలు చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలు తెగ హల్చల్ చేశాయి.
ఎంత మంది కొత్త హీరోయిన్స్ వచ్చిన సమంతకి అడ్డే లేదు. . ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా మారింది సమంత.ఇటీవల ఈ అమ్మడు నటించిన యశోద కోసం ఏకంగా రూ. 3 కోట్లు పారితోషికం తీసుకుంటుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపించింది. సినిమాలే కాదు సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తున్న సమంత తన సంపాదనని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తుందట. ను సంపాదించిన డబ్బుల్లో చాలా వరకు విరాళాల రూపంలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సమాజానికి తన వంతుగా సేవా చేస్తున్న సమంత దీనికి భారీగా విరాళాలు ఇస్తుందట.