Telugu Flash News

Samantha : క‌ష్ట‌కాలంలో స‌మంత‌నే అండ‌గా నిలిచిందంటూ చిన్మ‌యి ఆస‌క్తిక‌ర కామెంట్స్

samantha and chinmayi

Samantha :డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి శ్రీ పాద గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.స‌మంత‌కి త‌న గొంతు అరువుగా ఇచ్చి పాపుల‌ర్ అయిన చిన్మ‌యి మీటూ మూవ్‌మెంట్‌లో భాగంగా ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు పై లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పించి హెడ్ లైన్స్‌లో నిలిచింది. అయితే కొన్నాళ్లుగా స‌మంత‌కి, చిన్మ‌యికి ప‌డ‌డం లేద‌ని ప‌లు ప్ర‌చారాలు సాగాయి.

అయితే తాజా ఇంట‌ర్వ్యూలో చిన్మ‌యి స్పందిస్తూ క‌ష్ట కాలంలో స‌మంత త‌న‌కి అండ‌గా నిలిచింద‌ని పేర్కొంది. భారత్‌లోని అందరి నటులు ఎదుర్కొన్న అన్ని ఇబ్బందులను సమంత కూడా ఎదుర్కొంది.

ఆ అడ్డంకులన్నింటిని అధిగమించి ఆమె నటిగా ఇప్పుడు నిలదొక్కుకుంది. మీటూ సమయంలో నాకు అండగా నిలబడ‌డంతో పాటు నాపై నమ్మకముంచి నాకు మద్దతుగా నిలిచింది.

కష్టకాలంలో నాకు పనిని కూడా ఇచ్చి అన్ని వేళలా మద్దతు పలికింది’’ అంటూ చిన్మయి పేర్కొంది. దీంతో చిన్మ‌యి, స‌మంత మ‌ధ్య విబేధాలు ఉన్నాయ‌న్న వార్త‌ల‌కు పులిస్టాప్ ప‌డింది.

also read :

Flax Seeds : అవిసె గింజలతో మీ కొవ్వును కరిగించుకోండి..

Manchu Manoj and Bhuma Mounika Reddy Wedding Photos

 

Exit mobile version