Telugu Flash News

Samantha: స‌మంత ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుంది..!

samantha this year

Samantha Health Update : సమంత అరుదైన మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతుంది. దాదాపు ఏడెనిమిది నెలలుగా సమంత ఈ వ్యాధితో పోరాడింది. అత్యంత క్రిటికల్‌ స్థితి నుంచి కోలుకుంది. పోయిన ఫిట్‌నెస్‌ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తుంది.తాజాగా ఆమె స్థితి గురించి, తాను తీసుకుంటున్న థెరపీ గురించి సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది సమంత.

కొత్తగా తాను పూర్వస్థితికి చేరుకున్నట్టు తెలిపింది. మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్ సమర్దంగా పనిచేయించడంతో పాటు ఇతర వ్యాధుల కారణంగా ఇన్ ఫెక్షన్ భారినపడకుండా ఈ థెరపీ సహాయపడుతుంది.

ఇందుకోసం రోజుకూ సుమారు నాలుగు గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుందని స‌మంత చెప్పింది.. అయితే ఈ ట్రీట్‌మెంట్‌ని తాను ఇంట్లో నుంచే తీసుకుంటుందని కూడా పేర్కొంది స‌మంత‌. ఇక వ్యాధి నుండి కోలుకున్న స‌మంత ప్ర‌స్తుతం హిందీలో రూపొందుతున వెబ్‌ సిరీస్‌ `సిటాడెల్‌` రీమేక్‌లో నటిస్తుంది. మార్చి నుంచి తెలుగులో `ఖుషి` షూటింగ్‌లో పాల్గొనబోతుంది సామ్. ఇక స‌మంత న‌టించిన శాకుంత‌లం ఏప్రిల్‌ 14న విడుదల కాబోతుంది.

also read :

Punarnavi: గే ఫ్రెండ్‌తో పున‌ర్న‌వికి గ‌ర్భం అంటూ ప్ర‌చారాలు

తెలంగాణలో ఐదు రోజుల అలర్ట్.. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే..

Exit mobile version