HomecinemaSamantha: స‌మంత ఒంట‌రిత‌నంతో ఆవేద‌న చెందుతుందా... ఆమెకు తోడు వారిద్ద‌రేనా..!

Samantha: స‌మంత ఒంట‌రిత‌నంతో ఆవేద‌న చెందుతుందా… ఆమెకు తోడు వారిద్ద‌రేనా..!

Telugu Flash News

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత 2021 అక్టోబ‌ర్ లో విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. నాగ చైతన్యతో విడాకులు అయ్యాక ఆమె హైదరాబాద్ లో తన నివాసంలో ఒక్కరే ఉంటుంది. అయితే ఆమెకు ఇద్దరి తోడు ఉంది. వారు ఎవరో కాదు హాష్, సాషా. సమంత లోన్లీ ఫీలింగ్ దూరం చేసే బాధ్యత వాటిదే. ఇక సమంత సోషల్ మీడియా పోస్ట్స్ ఫాలో అయ్యేవాళ్ళకు హ్యాష్, సాషా ల గురించి తెలుసు. అవి సమంత పెట్ డాగ్స్. నాగ చైతన్యతో విడిపోక ముందు నుంచే సమంత వద్ద హ్యాష్ ఉంది. కొత్తగా సాషా అనే మరో పెట్ డాగ్ ని సమంత కొని పెంచుకుంది.

విరామ సమయంలో వాటితో గడపడం సమంతకు ఎంతో ఇష్టమైన వ్యాపకం. ఆ రెండు డాగ్స్ ని తన సొంత పిల్లలు మాదిరి చూసుకుంటూ ఉంటుంది. తాజాగా సమంత వాటిని ఉద్దేశిస్తూ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. సోపాలో బోర్లా పడుకున్న సమంత వీపుపై హ్యాష్ కాలు పెట్టి.. ఆ ఫోటో అభిమానులతో సమంత పంచుకున్నారు. దానికి సమంత ఇచ్చిన కామెంట్… ‘నువ్వు బాధపడకమ్మా… నీ వెనుక నేనున్నా, అని. నీకు ఏమైనా చూసుకోవడానికి నేనున్నా అని హ్యాష్ తనకు ధైర్యం చెబుతుందన్న అర్థంలో సమంత ఆ కామెంట్ పెట్టింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

కాగా సమంత చివ‌రిగా య‌శోద చిత్రంతో ప‌ల‌క‌రించింది. త్వ‌ర‌లో శాకుంత‌లం చిత్రంతో అల‌రించ‌నుండ‌గా, ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇటీవల మీడియా ముందుకు వచ్చారు. ఆమె లేటెస్ట్ మూవీ శాకుంతలం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. శాకుంతలం ట్రైలర్ ఆకట్టుకుంది. సమంత టైటిల్ రోల్ శకుంతలగా నటిస్తున్నారు. దుష్యంతుడిగా మలయాళ నటుడు మోహన్ దేవ్ చేస్తున్నారు. వీరి పుత్రుడు భరతుడు పాత్ర అల్లు అర్హ చేస్తుంది. మోహన్ బాబు కీలకమైన దుర్వాస మహర్షి రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న శాకుంతలం వరల్డ్ వైడ్ 5 భాషల్లో విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

also read :

BCCI:టీమిండియా జ‌ట్టులో జడేజాకి ఛాన్స్ లేన‌ట్టేనా… బీసీసీకి పెద్ద త‌ల‌నొప్పులు…!

-Advertisement-

varasudu telugu movie review : ‘వారసుడు’ తెలుగు మూవీ రివ్యూ

Viral video: ఔరా.. ఏం ధైర్యం? పులిని చేతులతో పట్టుకొస్తున్న మహిళ..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News