Telugu Flash News

Samantha :కూతురి కెరీర్ గురించి బ‌న్నీ ప‌ట్టించుకోడంటూ స‌మంత స్టన్నింగ్ కామెంట్స్

allu arjun

allu arjun

Samantha : శకుంత‌ల దుష్యంతుల అమ‌ర‌ప్రేమ‌గాథ శాకుంత‌లం ఈ నెల 14న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో దేవ్ మోహన్ కథానాయికుడిగా న‌టించాడు. ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధ‌మైన నేప‌థ్యంలో గ‌త కొన్ని రోజులుగా మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. స‌మంత ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చిత్రానికి సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తుంది.

Samantha : తొలిసారిగా విడాకులపై స్పందించిన సమంత

శాకుంత‌లం చిత్రంలో అర్హ బాలనటిగా నటించగా, దీని గురించి సామ్ మాట్లాడుతూ.. నా దృష్టిలో అల్లు అర్హ స్వ‌యంస్వ‌తంత్రురాలు. త‌నకు కావాల్సిన నిర్ణ‌యాలు తానే తీసుకునే టాలెంట్ ఉంది. బన్నీ అస‌లు ఆమె విష‌యాల్లో క‌ల‌గ‌జేసుకోవాల్సిన అవ‌స‌రం పెద్ద‌గా లేదు. ఆమె కెరీర్ విష‌యంలోనూ అత‌ని జోక్యం అంత అవ‌స‌రం ఉండ‌దు. అర్హ‌ కెరీర్‌లో ఇది అద్భుత‌మైన చిత్రం అని చెప్పాలి.. అర్హ రోల్ చాలా అద్భుతంగా వ‌చ్చింది. లీడ్ కేర‌క్ట‌ర్ల‌న్నీ ఒక ఎత్తు అయితే , అర్హ రోల్ మ‌రో ఎత్తు. పిల్ల‌లు, ఫ్యామిలీస్ ఈ క‌థ‌ను ఆస్వాదిస్తారని నేను న‌మ్ముతున్నాను అని స‌మంత స్ప‌ష్టం చేశారు.

Exit mobile version