HomesportsIPL: ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధికం.. ఏ ఆట‌గాడికి ఎక్కువ ధ‌ర ప‌లికింది అంటే..!

IPL: ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధికం.. ఏ ఆట‌గాడికి ఎక్కువ ధ‌ర ప‌లికింది అంటే..!

Telugu Flash News

IPL: ఐపీఎల్ వ‌ల‌న క్రికెట‌ర్స్ భ‌విష్య‌త్ మారిపోతుంది. ఒక‌వైపు కోట్లకు కోట్లు సంపాదిస్తూనే మ‌రోవైపు మంచి ఛాన్స్ లు అందుకుంటున్నారు. అయితే వేలంలో.. క్రికెటర్లపై కోట్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌ యువ క్రికెటర్‌ హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్ల భారీ పెట్టి.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. అలాగే.. టీమిండియా యువ క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను రూ.8.25 కోట్లకు సన్‌రైజర్స్‌ దక్కించుకోగా, టీమిండియా సీనియర్‌ ప్లేయర్‌ అజింక్యా రహానేను బేస్‌ ప్రైజ్‌ రూ.50 లక్షలకు చెన్నై దక్కించుకుంది. అయితే ఐపీఎల్‌ చరిత్రను తిరగరాస్తూ.. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ అ‍త్యధిక ధర పలక‌డం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

సామ్ క‌ర‌ణ్ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు పోటీ ప‌డ‌గా, చివ‌ర‌కు పంజాబ్‌ కింగ్స్‌ సామ్‌ కర్రన్‌ను రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ 2022 వేలంలో 17 కోట్ల పైచిలుకు ధర పలికిన ఇషాన్‌ కిషన్‌ రికార్డును సామ కర్రన్‌ బద్దలు కొట్ట‌డం విశేషం. దాంతో 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా సామ్ కరన్ రికార్డుకెక్కాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ రూ.16.25 కోట్ల రికార్డును అధిగమించాడు. ఐపీఎల్‌ 2019 సీజన్‌లో సామ్‌ కర్రన్‌కు కేవలం 5.5 కోట్ల ధర మాత్రమే దక్కింది

ఇక బిగ్ మ్యాచ్ విన్నర్, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే సొంతం చేసుకుంది. ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ కోసం సీఎస్‌కేతో పాటు ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీపడ్డాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ.17.75 కోట్ల రికార్డు ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. జాసన్ హోల్డర్‌ను రూ.5.75 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయగా.. సికిందర్ రాజా రూ.50 లక్షలు(పంజాబ్), ఓడియన్ స్మిత్ రూ.50 లక్షలు(గుజరాత్), అజింక్యా రహానే రూ.50 లక్షలకి(సీఎస్‌కే) అమ్ముడయ్యారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News