Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా వారు సల్మాన్‌ని ఏదో రకంగా బెదిరిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు గోల్డీ బ్రార్, లారెన్స్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ కి మరింత భద్రతను పెంచారు. ఇంటి(గెలాక్సీ) వెలుపల మరింత సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు.
ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారులు, ఎనిమిది నుండి పది మంది కానిస్టేబుళ్లు నిత్యం సల్మాన్‌కి భద్రతాగా ఉంటారు. ఇక ఆయన నివాసం-కమ్-ఆఫీస్ వెలుపల అభిమానులను సమావేశపరచడానికి అనుమతించబడదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.. ఇంతకు ముందు సల్మాన్ ఖాన్‌కు వై-ప్లస్ కేటగిరీ భద్రతను పోలీసులు అందించారు. ఆయన భద్రత కోసం పోలీసులు అదనపు భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇక గ్యాంగ్‌స్టర్లు బిష్ణోయ్, బ్రార్,రోహిత్ లపై బాంద్రా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలియజేశారు. కాగా, జూన్ 2022 లోనూ సల్మాన్ ఖాన్ పై కొంత మంది దుండగులు బెదిరింపులకు పాల్పడ్డ విషయం తెలిసిందే..
also read :