Telugu Flash News

Shruti Haasan : కాళ్లు క‌మిలిపోయేలా ప్ర‌భాస్ హీరోయిన్ వ‌ర్క‌వుట్స్..

shruti haasan

shruti haasan

Shruti Haasan: ఇటీవ‌లి కాలంలో హీరోల‌తో పాటు హీరోయిన్స్ సైతం తెగ హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. వారితో పోటీ ప‌డి మ‌రీ న‌టించ‌డ‌మే కాక రిస్క్‌లు కూడా చేస్తున్నారు. అయితే క‌మ‌ల్ గారాల ప‌ట్టి అయిన శృతి హాస‌న్ మంచి జోరు మీదుంది. స్టార్ హీరోలతో పాటు సీనియర్స్ కి బెస్ట్ ఆప్షన్ గా మారిన శృతి క్రాక్ మూవీతో కంబ్యాక్ హిట్ అందుకుంది.

ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ అనే పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తుంది. అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి హాస‌న్ ఈ సినిమా కోసం బాగా క‌ష్ట‌ప‌డుతుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలలో మోకాళ్ళు బాగా కందిపోయినట్లుగా కనిపిస్తున్నాయి.

తెల్ల చర్మంపై కందిపోయిన మరకలు చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. వర్కౌట్స్ ఈ స్థాయిలో అవసరమా.. ఆల్రెడీ చిక్కిపోయి కనిపిస్తున్నావు అని కొంద‌రు నెటిజ‌న్స్ ఆమెకు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తున్నారు. ఇటీవ‌లే శృతి హాస‌న్ స‌లార్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది.

also read :

Eggshells : గుడ్డుతో పాటు పెంకులు తిన్నా ఆరోగ్యమే!

Shriya Saran You And I Magazine Photoshoot Photos 2023

MLC Kavitha : అరెస్టుపై కవిత కౌంటర్.. లిక్కర్ స్కామ్‌పై కీలక వ్యాఖ్యలు!

Exit mobile version