HomecinemaAmitabh bachchan: అమితాబ్‌పై స‌జ్జ‌నార్ సంచ‌ల‌న కామెంట్స్.. ఆశ్చ‌ర్యంలో నెటిజ‌న్స్

Amitabh bachchan: అమితాబ్‌పై స‌జ్జ‌నార్ సంచ‌ల‌న కామెంట్స్.. ఆశ్చ‌ర్యంలో నెటిజ‌న్స్

Telugu Flash News

Amitabh bachchan: దిశా ఎన్‌కౌంట‌ర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు స‌జ్జ‌నార్. ఆ సంఘ‌ట‌న నుండి సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తుండ‌గా, టీఎస్ఆర్టీసీ సేవలపై జ‌నాల‌లో అవ‌గాహ‌న పెంచేందుకు సోష‌ల్ మీడియాని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటాడు. అయితే తాజాగా ఆయ‌న బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నం రేపుతున్నాయి.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ప‌లు కంపెనీల‌కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండ‌గా, అమితాబ్ ప్రచారం చేస్తున్న ఆమ్వే అనే కంపెనీపై సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ పెట్టారు.

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కి, ఇతర సెలెబ్రెటీలకు నాదొక విన్న‌పం . ప్రజలని మోసం చేసే, దేశ ఆర్థిక వ్యవస్థని ముంచేసే ఫ్రాడ్ కంపెనీల‌ని మీరు ప్ర‌చారం చేయ‌వ‌ద్దు అంటూ త‌న పోస్ట్‌లో తెలియ‌జేశారు స‌జ్జ‌నార్.

మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీగా ఉన్న ఆమ్వేపై 2022లో ఈడీ కేసు నమోదు కాగా, ఆ కంపెనీ ఆస్తులని జప్తు కూడా చేసింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News