Telugu Flash News

NTR 30: ఎన్టీఆర్ టీంలో జాయిన్ సైఫ్ అలీ ఖాన్.. చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోలు

saif ali khan joined in ntr koratala movie

NTR 30: ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కొర‌టాల గ‌త చిత్రం ఆయ‌న‌కు పెద్ద షాక్ ఇచ్చింది. మరోవైపు చిరంజీవి పరోక్ష విమర్శలు ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టాయి అని చెప్పాలి. ఇప్పుడు బౌన్స్ బ్యాక్ కావాలని అనుకుంటున్నారు.

తానేమిటో నిరూపించాలని కసిగా ముందుకు వెళుతున్నారు కొరటాల‌. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్ 30 తెరకెక్కిస్తుండ‌గా, ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపారు. జాన్వీ కపూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇక ఎన్టీఆర్ 30లో ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండ‌గా, ఈ రోజు అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు.

also read : NTR Wife Pranathi : చార్మినార్‌లో సోలోగా షాపింగ్ చేసిన ఎన్టీఆర్ భార్య‌.. అంద‌రు షాక్!

ఎన్టీఆర్ 30లో విలన్ గా సైఫ్ నటిస్తున్నారంటూ కొన్నాళ్లుగా వినిపిస్తుండ‌గా, ఎట్ట‌కేల‌కు ఈ రోజు క్లారిటీ వ‌చ్చింది. సైఫ్ అలీ ఖాన్ కి ఎన్టీఆర్ 30 సెట్స్ లోకి ఆహ్వానం పలక‌గా, సెట్స్ లో హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివతో కలిసి సైఫ్ ఫోటోలకు ఫోజిచ్చారు. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. బాలీవుడ్ కి చెందిన జాన్వీ, సైఫ్ అలీఖాన్ నటించడం ద్వారా నార్త్ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా మ‌రింత చేరువ అవుతుంద‌ని భావిస్తున్నారు. 2024 సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

Exit mobile version