Telugu Flash News

Sai dharam Tej: జ‌బ‌ర్ధ‌స్త్ షోలో సాయి ధ‌ర‌మ్ తేజ్ సంద‌డి.. యాంక‌ర్‌పై అదిరిపోయే పంచ్‌లు..!

sai dharam tej struggles during accident

Sai dharam Tej: టాలీవుడ్ యువ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం విరూపాక్ష‌. ఏప్రిల్ 21న ఈ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. అయితే కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీని స్టార్ డైరెక్టర్​ సుకుమార్, బీవీఎస్​ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించ‌గా, మూవీపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

సాయితేజ్​ కొంత గ్యాప్ తర్వాత రానుండటంతో ఆయన్ను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చిత్ర ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చిత్ర బృందం రీసెంట్​గా ప్రముఖ టెలివిజన్ షో ‘జబర్దస్త్​’లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో తాజాగా విడుదలైంది. ఇందులో యాంకర్ సౌమ్యపై పంచుల మీద పంచులు వేస్తూ అల‌రించారు సాయిధ‌ర‌మ్.

షోకు ఏంజెల్స్ రావడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా అంటూ సాయి తేజ్ అన‌గా, అది తనను అన్నారేమోనని యాంకర్ సౌమ్య భావించింది. అప్పుడు మిమ్మల్ని కాదు నేన‌న్న‌ది అని మెగా మేనల్లుడు జోక్ చేశారు. రీటేక్​లు ఎవరు ఎక్కువగా తీసుకున్నారంటే.. డైరెక్టర్ అంటూ అదిరిపోయే పంచ్​ వేశారు సాయి తేజ్. ప్రోమో చివర్లో పవన్ సార్, ధర్మరాజ్ సర్ అంటూ సౌమ్య పిలవగా.. ఇంకా నయం, యమ ధర్మరాజు అని అనలేదంటూ తెగ నవ్వులు పూయించారు మెగా హీరో.

also read :

Fruits : ఉప్పు కారం అద్దుకొని ఈ ఫ్రూట్స్ తింటున్నారా? బీ కేర్ ఫుల్..

Janhvi kapoor hot photoshoot for Filmfare Awards 2023

Exit mobile version