Sai Pallavi: సాయి పల్లవి.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె తక్కువ సమయంలోనే లేడి పవర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తన డ్యాన్స్, నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అయితే ఈ అమ్మడికి సంబంధించి తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తుంది. సాయిపల్లవి ఇక సినిమాల్లో నటించదు అని, తాను ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి ప్రజలకు వైద్యం చేస్తూ ఆ వృత్తిలోనే సంతృప్తిని వెతుక్కోబోతోందనే విధంగా ఓ ప్రచారం అయితే నడుస్తుంది. అయితే కెరీర్ పీక్ లో ఉండగా పరిశ్రమ నుంచి సాయి పల్లవి విరమిస్తోందనేది జీర్ణించుకోలేనిది.
సాయి పల్లవి తన కెరీర్ లో ఒక దశాబ్దం కంటే తక్కువ సమయంలోనే అసాధారణమైన అభిమానులను సొంతం చేసుకుంది. సాయిపల్లవి 2015లో మలయాళ చిత్ర పరిశ్రమలో నటనా ఆరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఇప్పుడు టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగింది. ఇటీవల సాయి పల్లవి విరాటపర్వం – గార్గి చిత్రాలలో నటించగా, వీటి తర్వాత ఈ అమ్మడికి పలు ఆఫర్స్ వచ్చాయి. ఆ ఆఫర్లను తిరస్కరించింది. దీంతో ఈ బ్యూటీ త్వరలో వినోద ప్రపంచానికి వీడ్కోలు పలుకుతుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. . ఇప్పటికీ సాయి పల్లవికి అనేక ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆమె ఆసుపత్రిని నిర్మించాలనే తన మిషన్ పై పూర్తిగా దృష్టి సారించినందున వాటిలో దేనినీ అంగీకరించడం లేదనే టాక్ నడుస్తుంది. .
తాజా కథనాల ప్రకారం సాయి పల్లవి ఇప్పుడు కోయంబత్తూరులో సొంత ఆస్పత్రిని నిర్మించడంపై ఎక్కువ దృష్టి పెడుతుందని, తన కెరీర్ ని పూర్తిగా ఆస్పత్రి నిర్వహణకే అంకితమిస్తుందని చెబుతున్నారు. సాయిపల్లవి నిర్మించే భారీ ఆసుపత్రిని తన సోదరి పూజా కన్నన్ నిర్వహిస్తారని టాక్. ఒక భారీ మిషన్ ని విజయవంతంగా పూర్తి చేయడం కోసం సాయి పల్లవి కాస్త గ్యాప్ తీసుకుందని, ఇది పూర్తైతే సాయి పల్లవి తిరిగి సినిమాలలో నటించే ఛాన్స్ ఉందని కొందరు చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి ఈ అమ్మడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.
also read news:
మీజిల్స్ వైరస్ అంటే ఏమిటి? లక్షణాలు, నివారణ చర్యలు, చికిత్సా మార్గాలివీ..