దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి సాయిపల్లవి (Sai Pallavi) . గ్లామర్‌కి దూరంగా ఉంటూ, సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రేమమ్ (Premam) సినిమాతో మలయాళంలో ప్రయాణం ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ వరకు చేరుకుంది.
తాజా ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇప్పటివరకు ప్రేమలో పడలేదా అని అడిగిన ప్రశ్నకు సాయిపల్లవి ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మహాభారతం (Mahabharatam) తనకు చాలా ఇష్టమని, అందులో అభిమన్యుడి పాత్రను ఎంతగానో ప్రేమిస్తానని చెప్పింది. “గత పదిహేడేళ్లుగా అభిమన్యుడి పాత్ర గురించి ఏదో కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నా. ఆయనకు సంబంధించిన ఏ కథ అయినా నాలో ఆసక్తిని పెంచుతుంది. ఓరకంగా చెప్పాలంటే గత పదేండ్లుగా ఆయన ప్రేమలో ఉన్నా” అంటూ నవ్వుతూ తన మనసులోని మాటను బయటపెట్టింది.
సాయిపల్లవి సమాధానం విన్న నెటిజన్లు ఆమెలో హాస్యచతురత కాస్త ఎక్కువేనని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో ‘తండేల్’, తమిళంలో ‘అమరన్’, హిందీలో ‘రామాయణ’ సినిమాలతో బిజీగా ఉంది.