HomecinemaSai Pallavi: పుకార్లకి చెక్.. ఆశీర్వాదం కావ‌లంటున్న నేచుర‌ల్ బ్యూటీ

Sai Pallavi: పుకార్లకి చెక్.. ఆశీర్వాదం కావ‌లంటున్న నేచుర‌ల్ బ్యూటీ

Telugu Flash News

Sai Pallavi: ఇటీవ‌లి కాలంలో విరాట పర్వం, గార్గి చిత్రాల్లో నటించింది సాయి పల్లవి. అయితే ఆ తర్వాత ఆమె వెండితెర మీద ఎందుకో కనిపించలేదు. క‌నీసం తర్వాతి ప్రాజెక్టులపై కూడా ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వలేదు. గ‌త కొంత కాలంగా ఆమె త‌న సినిమాలపై ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో ఆమె ఫ్యాన్స్‌ ఫీలయ్యారు. నిజంగానే సాయి పల్లవి సినిమాలు మానేస్తుందనని భావించారు. అయితే ఈ రూమర్లకు తాజాగా చెక్‌ పెట్టింది న్యాచురల్‌ బ్యూటీ. ఎట్టకేలకు తన కొత్త సినిమా ప్రారంభించి సంతోష ప‌ర‌చింది. ఆ మధ్యన కథ నచ్చి, తన పాత్ర బాగుంటే సినిమాలు చేస్తుందని చెప్పుకొచ్చిన సాయి పల్లవి ఇప్పుడు ఆ మాటను నిజం చేసి చూపించింది..

సాయి పల్లవి తన తర్వాతి సినిమా కమల్ హాసన్ బ్యానర్‌లో చేయనుండ‌డం విశేషం. ఇందులో శివ కార్తికేయన్‌ హీరోగా నటించనున్నాడు. జీవి ప్రకాశ్‌కుమార్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా జర‌గ‌గా, ప్ర‌స్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. ముఖ్యంగా సాయి పల్లవి స్టిల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. న్యాచురల్‌ బ్యూటీ ఎంతో క్యూట్‌గా ఉందని అభిమానులు అంటున్నారు. అయితే ఈ సినిమాకి అభిమానుల ఆశీర్వాదం కావాల‌ని సాయి ప‌ల్ల‌వి అంటుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News