HomecinemaSai Pallavi | కులాంతర వివాహాలపై సాయి పల్లవి కామెంట్స్ వైరల్

Sai Pallavi | కులాంతర వివాహాలపై సాయి పల్లవి కామెంట్స్ వైరల్

Telugu Flash News

తెలుగు సినీ పరిశ్రమలో సాయి పల్లవి (Sai Pallavi) అనే పేరు ఒక ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. తన సహజమైన అందం, ప్రతిభావంతమైన నటన మరియు ప్రగతిశీల ఆలోచనలతో ఆమె లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.

‘ఫిదా’ (fidaa) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి, తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. తన తర్వాతి సినిమాలలో కూడా తన నటనతో ఆకట్టుకుంటూ వస్తోంది.

సాయి పల్లవి సినిమాలను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంది. తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను ఎంచుకుంటుంది. తన పాత్ర సాంప్రదాయ విలువలను ప్రతిబింబించేలా ఉండాలని కోరుకుంటుంది. అలాగే, ముద్దు సన్నివేశాలు లేదా చిన్న బట్టలు వంటివి తన పాత్రకు సరిపడవని భావిస్తుంది.

సాయి పల్లవి కులాంతర వివాహాల గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన కమ్యూనిటీలోని కొంతమంది కులాంతర వివాహాలు చేసుకున్నప్పటికీ, తమ కమ్యూనిటీ వారు వేరే కమ్యూనిటీలో వివాహం చేసుకుంటే వారిని బహిష్కరిస్తారని చెప్పింది.

ప్రస్తుతం హిందీలో రామాయణం (ramayanam) మరియు తెలుగులో నాగచైతన్యతో తండేల్ (thandel) సినిమాలో నటిస్తోంది.ఇటీవలే తన చెల్లెలు పూజ వివాహం వైభవంగా జరిగింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన గురించి బయట ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటుంటారని, అలాంటి వాటిని పట్టించుకోవద్దని తన నాన్నతో చెప్పినట్లు తెలిపింది.

also read :

-Advertisement-

Sai Pallavi | అభిమన్యుడిపై పదిహేడేళ్ల ప్రేమ : సాయిపల్లవి

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News