Telugu Flash News

Sai Dharam Tej : మరోసారి హాట్ టాపిక్ గా మారిన సాయి ధరమ్ తేజ్ పెళ్లి !!

sai dharam tej

Sai Dharam Tej marriage News : ఇటీవల అందాల భామలు, కుర్ర హీరోలు పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజుల క్రితం మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి ఇటలీలో జరగగా మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఇక ఇప్పుడు సాయిధరమ్ తేజ్ పెళ్లికి సమయం ఆసన్నమైందని అంటున్నారు. పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయిధరమ్ తేజ్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మధ్యమధ్యలో కొన్ని ఫ్లాప్‌ సినిమాలు తీసిన విరూపాక్షతో పెద్ద హిట్‌ కొట్టాడు.

అయితే రెండేళ్ల క్రితం బైక్ ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నాడు. అయితే సాయిధరమ్ తేజ్ 36 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన పెళ్లికి సంబంధించి విపరీతమైన ప్రచారం జరుగుతున్నా తేజ్ స్పందించడం లేదు. ఆ మ‌ధ్య టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్‌తో సాయి ధరంతేజ్ పెళ్లి జరగబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అంతకు ముందు రెజీనాతో ప్రేమలో ఉన్నాడ‌ని, ఆమెను పెళ్లి చేసుకుంటాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

అయితే ఇప్పుడు మళ్లీ సాయి ధరమ్ తేజ్-రెజీనా పెళ్లి వార్త హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ రహస్యంగా ప్రేమాయణం సాగిస్తున్నారని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ తన పేరును సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నాడు. తన పేరులో తన తల్లి పేరు ‘దుర్గ’ చేర్చుకున్నట్లు వివరించారు. తన తల్లి ఎప్పుడూ తన వెంటే ఉంటుందనే భావనతో ఈ పేరును చేర్చినట్లు సాయి తేజ్ తెలిపారు.

Exit mobile version