Telugu Flash News

Saeed Anwar : మోదీపై పాక్‌ మాజీ క్రికెటర్‌ పైత్యపు మాటలు.. ట్విట్టర్‌లో వైరల్‌!

saeed anwar comments on pm narendra modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ సయీద్‌ అన్వర్‌ (saeed anwar) కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. భారత ప్రధాని మోదీకి సైతాన్‌ ఆవహించిందంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశాడు. ఓ మసీదు ఎదుట జన సమూహం ముందు అన్వర్‌ ఈ మాటలు మాట్లాడాడు.

సాధారణంగా ముస్లింల ప్రార్థనా సమయానికి ముందు ఇచ్చే పిలుపును అజాన్‌ అని పిలుస్తారు. అయితే, అజాన్‌ ఇచ్చే సమయంలో ప్రధాని మోదీ ఎన్ని సార్లు తన ప్రసంగాన్ని ఆపినా సైతాన్‌ ఆవహించిన హిందువుగానే మిగులుతాడంటూ సయీద్‌ అన్వర్‌ వ్యాఖ్యానించాడు. ఇండియా ప్రధానిపై అవాక్కులు చవాక్కులు పేల్చడంతో ఇప్పుడు ఈ టాపిక్ చర్చనీయాంశమైంది.

పాకిస్తాన్‌ అన్‌టోల్డ్‌ అనే ట్విట్టర్‌ ఖాతాలో సయీద్‌ అన్వర్‌ చేసిన వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఇది ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. దురుద్దేశంతో సయీద్‌ అన్వర్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇండియన్‌ నెటిజన్లు అన్వర్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఓ ఆటగాడికి ఎంత మద్దతుగా నిలిచినా తన బుద్ది చూపిస్తున్నాడని మండిపడుతున్నారు. అన్వర్‌పై విరుచుకుపడుతున్నారు. సయీద్‌ అన్వర్‌ క్రికెట్‌ ఆడుతున్న సమయంలో, ఇండియా పర్యటనకు వచ్చిన సందర్భాల్లోనూ అతడి ఆటకు గౌరవం, మద్దతు పలికామని, శత్రుదేశానికి చెందిన వాడైనా గౌరవం ఇచ్చామంటున్నారు.

ఇవన్నీ మరిచి తన వక్రబుద్ధిని చూపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైతాన్‌ ఆవహించింది మోదీకి కాదని, మతం మత్తులో విద్వేషాలను రెచ్చగొడుతున్న అన్వర్‌కేనని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. ఓ మసీదు సమీపంలో అజాన్ ఇచ్చారు.

ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ.. కొంత సేపు తన ప్రసంగాన్ని ఆపేశారు. దీన్ని ఉద్దేశిస్తూ సయీద్‌ అన్వర్ ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై దేశమంతటా ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి.

అన్వర్‌ 1989లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2003లో ఆటకు వీడ్కోలు పలికాడు. తర్వాత ఇస్లాం మత ప్రచారకుడిగా మారిన అన్వర్‌.. ఇప్పుడు భారత్‌పై విషం కక్కుతున్నాడు. 2001-02లో బంగ్లాదేశ్‌తో చివరి మ్యాచ్‌ ఆడుతుండగా… అతని కుమార్తె బస్మా అన్వర్‌ అనారోగ్యం కారణంగా కన్ను మూసింది. మ్యాచ్‌ మధ్యలోనే అన్వర్‌కు ఈ విషయం తెలిసింది.

ఆ మ్యాచ్‌లో అన్వర్‌ సెంచరీ కూడా చేశాడు. ఆ సమయంలో అతనికి పాకిస్తాన్‌తోపాటు భారత అభిమానులు కూడా మద్దతుగా నిలిచారు. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కానీ ఇప్పుడు అన్వర్ భారత ప్రధానిపై ఇలా వ్యాఖ్యలు చేయడం శోచనీయం.

Also Read :

MLC Kavitha : లిక్కర్‌ స్కామ్‌లో కవితకు బిగుస్తున్న ఉచ్చు.. విచారణపై ఉత్కంఠ!

Allu Arjun: అల్లు అర్జున్, సందీప్ రెడ్డి మూవీకి టైటిల్ ఫిక్స్..!

kitchen tips (08-03-2023) : ఈ 9 వంటింటి చిట్కాలు మీ కోసం..

vastu tips : వాస్తు సమస్యలు – ఏయే సమయాలలో వాస్తు పూజ చేయాలి ?

 

Exit mobile version