Telugu Flash News

Yuvaraj: యువ‌రాజ్ అనారోగ్యం గురించి ముందుగానే గుర్తించిన స‌చిన్.. అత‌నికి ఎలా తెలిసింది…!

Yuvaraj: భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో యువ‌రాజ్ సింగ్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ ఆ టోర్నీలో 8 ఇన్నింగ్స్‌ల్లో 362 పరుగులు చేసాడు. ఇక బౌలింగ్‌లో 15 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా గెలిచాడు. ఈ టోర్నీ తర్వాత కొన్ని రోజులకే యువరాజ్ సింగ్ ప్రాణాంతక క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. అయితే యువీ కంటే ముందే సచిన్ ఈ విషయాన్ని గుర్తించాడట… మొదటి మ్యాచ్ తర్వాత యువరాజ్ ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతుండడాన్ని సచిన్ ముందుగానే గుర్తించి.. హోటల్ లో తన రూమ్ కి పిలిచారు.

యువరాజ్ సింగ్ ఎనర్జీ లెవల్స్ తగ్గుతుండడాన్ని తాను స్వయంగా చూశానని ,ఆ సమయంలో యువరాజ్ ని హెచ్చరించిన‌ట్టు స‌చిన్ తెలిపాడు. డిన్నర్ అయ్యాక యువరాజ్ వెళ్లబోతుంటే.. అతనికి ఒక విషయం చెప్పారట సచిన్. “చూడు యువీ, మొదటి మ్యాచ్ తర్వాత నీ ఎనర్జీ తగ్గింది. నీకు కొన్ని గోల్స్ పెడతాను. ముందు ఫీల్డింగ్ గోల్స్ పెడతాను. నువ్వు చాలా అద్భుతమైన అథ్లెటిక్ ఫీల్డర్ వి. కానీ నీ ఎనర్జీ పడిపోతుండడం నేను గమనించాను. రేపటి నుంచి మనం సెపరేట్ గా ప్రాక్టీస్ సెషన్స్ పెట్టుకుందాం. నేను నీ ఎనర్జీ లెవల్స్ ని పెంచగలనేమో చూస్తాను. ఇలా చేస్తే నీ గ్రాఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది. అని సచిన్ చెప్పారు. తన మాటలకు యువరాజ్ సింగ్ ప్రాధాన్యత ఇచ్చారని, ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసామని సచిన్ అన్నారు.

అయితే ఎంతో క‌ష్ట‌ప‌డ్డ యువరాజ్ ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచి.. భారత జట్టుకి ప్రపంచ కప్ ని అందించారు. కోట్ల మంది అభిమానుల కలని నిజం చేసిన యువరాజ్ సింగ్.. ఆ తర్వాత క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు తెలిసిందని సచిన్ చెప్పుకొచ్చారు. అలా సచిన్ డాక్టర్ల కంటే ముందుగానే యువరాజ్ సింగ్ అనారోగ్యాన్ని గుర్తించి.. అతనిలో ధైర్యాన్ని నింపారు. సచిన్ కెరీర్ లో ప్రపంచ కప్ ఉండాలన్న కసితో, ఈ వరల్డ్ కప్ ఆడానని చెప్పిన యువరాజ్.. క్యాన్సర్ తో పోరాడి తిరిగి భారత జట్టులో చోటు సంపాదించుకున్నారు

Exit mobile version