Telugu Flash News

Sachin: బుమ్రాకి ప‌ర్‌ఫెక్ట్ రీప్లేస్‌మెంట్ ష‌మీ… స‌చిన్ కీల‌క వ్యాఖ్య‌లు

Sachin: మ‌రి కొద్ది రోజుల‌లో భార‌త్ టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ తొలి మ్యాచ్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ టోర్నీకి ముందు టీమిండియా పేస్ బౌల‌ర్ బుమ్రా గాయంతో జ‌ట్టుకు దూరం అయ్యాడు. ఆయ‌న‌న స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తారు అని సందేహం నెల‌కొన్న స‌మ‌యంలో షమీ.. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏడాది విరామం తర్వాత తొలి టీ20 మ్యాచ్‌ ఆడుతున్న షమీ భారత్‌ తరఫున ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో షమీ చేతికి రోహిత్ చాలా ఆల‌స్యంగా బంతిని అందించాడు . అనూహ్యంగా ఆఖరి ఓవర్లో 11 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా గెలుస్తుందన్న పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ.. షమీ చేతికి బంతిని అందివ్వ‌గా అత‌ను అద్భుతం చేశాడు.

స‌చిన్ ప్ర‌శంస‌లు..

Sachin Tendulkar on Mohammed Shami

ఏడాదిగా ఇండియన్‌ టీ20 టీమ్‌లో లేని ష‌మీ ఎంతమేర రాణిస్తాడన్న సందేహం ఉండేది. మొత్తానికి తనను ఎంపిక చేసినందుకు తానేంటో ఒక్క ఓవర్‌తోనే నిరూపించాడు మహ్మద్‌ షమి. ఆస్ట్రేలియాతో వామప్‌ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో మూడు వికెట్లు తీసి అనూహ్యంగా ఓడే మ్యాచ్‌లో విజయం సాధించి పెట్టి అంద‌రి ప్ర‌శంస‌లు పొందాడు.షమి బౌలింగ్‌పై తాజాగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ స్పందించాడు. బుమ్రాకు తానే సరైన ప్రత్యామ్నాయమని నిరూపించుకున్నాడని మాస్ట‌ర్ ప్ర‌శంస‌లు కురిపించ‌డం విశేషం.

jasprit bumrah

బుమ్రా లేకపోవడం టీమిండియాకి పెద్ద లోటే. అతని స్థానంలో ఓ స్ట్రైక్‌ బౌలర్‌ అవసరం ఏర్పడింది. బ్యాటర్లను అటాక్‌ చేస్తూ వికెట్లు తీయగల బౌలర్ తానేన‌ని, సరైన ప్రత్యామ్నాయం కూడా తానేన‌ని షమి నిరూపించుకున్నాడు” అని పీటీఐతో మాట్లాడుతూ సచిన్‌ అన్నాడు. అలానే అర్ష్‌దీప్‌ సింగ్‌పై కూడా సచిన్‌ ప్రశంసలు కురిపించాడు. “అర్ష్‌దీప్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. పూర్తి నిబద్ధత గల ప్లేయరని అనిపించుకుంటున్నాడు. ఓ ప్లేయర్‌ను అతని మైండ్‌సెట్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు . అర్ష్‌దీప్‌కు ఓ ప్లాన్‌ ఉందని, దానిని అతను ప‌క్కాగా అమలు చేస్తున్నాడని సచిన్‌ ప్రశంసించాడు. కాగా, గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇప్పటి వరకూ మళ్లీ టీ20ల్లో ఆడని షమీతో డెత్ ఓవర్ బౌలింగ్ చేయించడం అనేది ష‌మీకి అగ్ని ప‌రీక్ష కాగా అందులో నెగ్గాడు.

ఇవి కూడా చూడండి : 

వయస్సు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..

పిల్లల్లో జ్వరానికి భయపడద్దు.. ఇలా చేయండి..

సాయంత్రం ఆరు దాటాక చేయకూడని పనులు

Exit mobile version