Sachin: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. క్రికెట్ లో తన పేరిట లెక్క లేనన్ని రికార్డులు నెలకొల్పి క్రికెట్ ను ఆరాధించే ప్రతి ఒక అభిమానికి దేవుడిగా మారాడు సచిన్. ఆయన రిటైర్ అయినప్పటికీ జనాలలో సచిన్‌పై ఉన్న ప్రేమ, ఆప్యాయత తగ్గలేదు. ఇక సచిన్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయనకు కొడుకు మరియు కూతురు ఉన్న విషయం తెలిసిందే. కొడుకు అర్జున్ టెండూల్కర్ తండ్రిలాగా క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోగా, కూతురు సారా టెండూల్కర్ సోషల్ మీడియా ద్వారా అందరికి దగ్గరైంది. సారా చూడడానికి అందాల బొమ్మల ఉంటుంది. అంతేకాదు ఈ అమ్మడుకు ఆల్ ఇండియా వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.
సారా నిత్యం సోషల్ మీడియాలో తన పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఎంతగానో అలరిస్తుంటుంది. పలు యాడ్స్‌లో కూడా నటించి అనేక ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఇదే అదునుగా బాలీవుడ్‌లో ఎంట్రీ కోసం తాను యాక్టింగ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటోందని సినీ వర్గాల్లో ఫుల్ టాక్ వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే సారాను తమ సినిమాల ద్వారా పరిచయం చేయించాలని ఎంతో ఆసక్తి గా ఫిల్మ్ మేకర్స్ తమ విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.
లండన్ కాలేజ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివిన సారా.. ప్రస్తుతం యూఎస్ఏలోని కాలిఫోర్నియాలో మాస్టర్స్ చదువుతుంది. అయితే ఈ అమ్మడు ఓ కొత్త ఆలోచన చేసింది. తన బిజినెస్ ఆలోచన గురుంచి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘కస్టమైజ్డ్ డైరీ ప్లానర్’ పేరిట కొత్త ఏడాది అంటే.. 2023 కోసం ఓ ప్రత్యేకమైన డైరీని రూపొందించగా, ఇందులో తాము రోజు చేయాలనుకునే పనులను ఎంటర్ చేయడంతో పాటూ వాటిని సమర్థవంతంగా పూర్తి చేసే విధంగానూ ప్రోత్సహిస్తోంది. డైరీలో ఫీచర్లు బాగానే ఉన్నప్పటికీ దాని ధర రూ. 2,500 ఉంది. ఈ ధర తెలిశాక నెటిజన్లు కొందరు విమర్శలు చేస్తున్నారు. సంపన్నలు కోసం కాదు పేద వాళ్ల కోసం ఏదైన ట్రై చేయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.