Sabja Seeds: మనకు చలవ చేసే వాటిలో సబ్జా గింజలు తప్పక ఉంటాయి. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి సబ్జా గింజల పానీయం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు.
సబ్జా గింజల పానీయం చలవ చేయడమే కాక మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంది.
పిల్లలకు మంచిది..
పడుకునే ముందు సబ్జా గింజల పానీయాన్ని తాగితే అస్సలు మలబద్ధక సమస్య ఉండదు. ఇది శరీరంలో ఉన్న వ్యర్థాలని కూడా బయటికి పంపిస్తుంది. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి.
ఇక బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం కంట్రోల్‌లోకి వస్తుంది. సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.
వికారంగా, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం ద్వారా ఫలితం ఉంటుంది.ఇక గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు కూడా ఈ పానీయం వలన దూరం అవుతాయి.
ఈ పానీయాన్ని నిత్యం పిల్లలకు తాగించడం వలన ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు. సబ్జాలో అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను కొంత వరకు నివారించే అవకాశం ఉంది.