Telugu Flash News

ఒకే ఓవర్‌లో 7 సిక్సులు! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్ .. కొట్టింది ఎవరో తెలుసా ?

ruturaj gaikwad broke yuvraj singh record

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆల్ టైమ్ రికార్డు బద్దలైంది. యువీ రికార్డును టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ బద్దలు కొట్టాడు. ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు రుతురాజ్. ఇప్పటి వరకు ఏ స్థాయి క్రికెట్‌లోనూ ఒకే ఓవర్‌లో వరుసగా 7 సిక్సర్లు కొట్టలేదు. 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదడం ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్. ఇటీవలి భారత దేశవాళీ టోర్నమెంట్, విజయ్ హజారే ట్రోఫీలో, రుతురాజ్ ఒకే ఓవర్‌లో వరుసగా 7 సిక్సర్లు (నోబాల్‌తో సహా) కొట్టాడు.

యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మహారాష్ట్ర బ్యాట్స్‌మెన్ రుతురాజ్ ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదాడు. యూపీ బౌలర్ శివ సింగ్ 49వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఐదో బంతి నోబాల్ కాగా… అది కూడా సిక్సర్ బాది,ఆపై రుతురాజ్ రెండు బంతుల్లో సిక్స్‌లు బాదాడు. దాంతో ఈ ఓవర్‌లో మొత్తం 43 పరుగులు వచ్చాయి. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు (43 పరుగులు) చేసిన ఆటగాడిగా రుతురాజ్ రికార్డు సృష్టించాడు. మరోవైపు, ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డు శివ సింగ్ పేరున నమోదు అయ్యింది.

ఏ స్థాయి క్రికెట్‌లోనూ ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టలేదు. ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు. భారత్ తరఫున ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో మాజీ ఆటగాడు రవిశాస్త్రి ఈ ఘనత సాధించగా, అంతర్జాతీయ క్రికెట్‌లో యువరాజ్ సింగ్ ఈ రికార్డును అందుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో స్టీవార్డ్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ 6 సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా ఆటగాడు హర్షెల్ గిబ్స్, వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ కూడా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదారు.

ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (220 నాటౌట్; 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. రుతురాజ్ తన ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లు కొట్టాడు. అంకిత్ బావ్నే (37), అజీమ్ కాజీ (37) రాణించారు. రుతురాజ్ విధ్వంసంతో మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 330 పరుగులు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు 331 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

also read news:

ప్రభాస్‌, కృతిసనన్‌ నిజంగా లవ్ లో ఉన్నారా ? వరుణ్‌ ధావన్‌ చెప్పేశాడు గా.. వీడియో వైరల్‌

ఉపవాసం వల్ల ఆరోగ్యానికి కలిగే 12 అద్భుత ప్రయోజనాలు

 

Exit mobile version