అధ్యక్షునిగా తన సేవలందిస్తూ అనతి కాలంలోనే ప్రపంచంలోనే అంత్యంత ప్రాముఖ్యత చెందిన అధ్యక్షులలో వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కూడా ఒకరు. అలాంటి పుతిన్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ పై ఒక లుక్ వేయండి.
వ్లాదిమిర్ పుతిన్ 1952, అక్టోబర్ 7న రష్యాలో ఇప్పుడు సెయింట్ పీటర్స్ బర్గ్ గా పిలువ బడుతున్న లెనిన్ గ్రాడ్ లో వ్లాదిమిర్ స్పిరిదోనోవిశ్చ్ పుతిన్(Vladimir Spiridonovich Putin),మరియా ఇవనోవ్న్నా పుతిన్ (Maria Ivanovna Putin) లకు జన్మించాడు.
వ్లాదిమిర్ తండ్రి స్పిరిదోనోవిశ్చ్ పుతిన్ 1930లలో సోవియట్ యూనియన్ లో నావికా దళంలోనూ, సబ్మెరైన్ (submarine) దళంలోనూ తన సేవలను అందించారు.ఆ తరువాత 1942లో మామూలు సోవియట్ సైన్యంలో చేరగా,అక్కడ జరిగిన యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు.
ఆ సమయంలో అక్కడ ఉన్న వ్లాదిమిర్ పుతిన్ మేన మామలు కూడా ఆచూకీ లేకుండా పోయారు.
పుతిన్ పుట్టక ముందు స్పిరిదోనోవిశ్చ్ పుతిన్,మరియా పుతిన్ లకు ఇద్దరు పిల్లలు జన్నించారు.అయితే దురృష్టవశాత్తూ ముందుగా పుట్టిన బిడ్డ పసితనంలోనే చనిపోగా, రెండో బిడ్డ 1942లో జరిగిన రెండో యుద్దపు గందరగోళంలో ఆకలి దప్పికలకు లోనై చనిపోయాడు.
ఇలా చిన్న తనం నుంచి యుద్ధాలలో జరిగిన ఆకలి దప్పికల మధ్యా,చావుల మధ్యా పెరిగిన వ్లాదిమిర్ పుతిన్ ఈ ప్రపంచాన్ని ఎలాగైనా అందరూ జీవించగల గొడవలు లేని ప్రపంచంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు.
12 ఏళ్ల వయసులోనే సంబో,జూడో లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పుతిన్ తన ప్రాథమిక విద్యనంతా సెయింట్ పీటర్స్ బర్గ్ హై స్కూల్ 281లో పూర్తి చేసుకుని, 1975లో సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో తన గ్రాడ్యుయేషన్న్ని (graduation) పొందాడు.
రాజకీయాలలో ఎంట్రీ
ఆ తరువాత 1977లో సెయింట్ పీటర్స్ బర్గ్ మైనింగ్ యూనివర్సిటీ లో పీహెచ్.డీ చేశాడు.
అక్కడితో తన చదువును పూర్తి చేసుకుని కేజీబీ (KGB) ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా చేరి దాదాపు 16 ఏళ్లు తన సేవలను అందించిన పుతిన్ అనతి కాలంలోనే లెఫ్టినెంట్ కలనెల్ స్థాయికి ఎదిగి చివరిగా 1991లో రాజకీయాలలోకి వెళ్ళడం కోసం తన పదవికి రాజీనామా చేశాడు.
1996లో మొస్కౌకి తన మకాం మార్చిన పుతిన్ కొంతకాలం ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ లో,సెక్రెటరీ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సెల్ ఆఫ్ రష్యాలోనూ తన సేవలను అందించి మంచి ప్రతిభ ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు.
1999లో ప్రధామంత్రి పదవిని చేజిక్కించుకున్న పుతిన్, యెల్ట్సిన్ అధ్యక్షుడుగా తన పదవి నుంచి దిగిపోయిన తరువాత ఆ పదవిని తన చెంతకు వచ్చేలా చేసుకుని అధ్యక్షుని కుర్చీ పై అధికారం సాధించాడు.
2004లో మరోసారి అధ్యక్షుడుగా ఎన్నికైన పుతిన్, తను ఎన్నికైయే కాలం రెండు సార్లకి పరిమితం కావడంతో తన పదవీ కాలం ముగించుకున్న తరువాత 2008 – 2012 సంవత్సరాలలో అప్పటి అధ్యక్షుడైన డిమిత్రి మెద్వెదేవ్ ఆధ్వర్యంలో మరోసారి ప్రధాన మంత్రిగా రష్యా ప్రభుత్వానికి తన సేవలను అందించాడు.
2012లో మోసపు ఆరోపణల మధ్య,నిరసనల మధ్య అధ్యక్షునిగా వ్యవహరించిన పుతిన్, 2018 మరోసారి ఆ పదవికి ఎన్నికయ్యాడు.
తను ఇన్నేళ్లు చూసి,అనుభవించిన విషయాల నుంచి నేర్చుకున్న పుతిన్ గత ఏడాది 2021లో తన పదవీకాలన్ని 2036 వరకు పెంచేలా ఒక కొత్త సవరణని తీసుకు వచ్చి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు.
పుతిన్ అధ్యక్షునిగా వ్యవహరించిన మొదటి పదవీ కాలంలో రష్యా ఆర్థిక వ్యవస్థ 70 శాతానికి పెరగగా,ఆ తరువాత రష్యాలో లెక్కలేనన్ని మార్పులను తీసుకువచ్చాడు.
అలెగ్జాండర్ లుకాషెంకో తరువాత అత్యధిక కాలం అధ్యక్షుని పదవిలో నిలిచిన రెండో యూరోపియన్ అధ్యక్షునిగా చరిత్ర సృష్టించాడు.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు