సుమారు సంవత్సర కాలంగా రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది.గత ఏడాది ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధం ఎటువంటి బ్రేకులు లేకుండా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎంత ఆస్తి నష్టం జరిగినా..ఎందరు ప్రాణాలు కోల్పోయినా.. యుద్దానికి ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనే ఎవరూ చేయడం లేదు.
ఇప్పటి వరకు జరిగిన ఈ పోరాటంలో మరియోపోల్,క్రిమియా, డాన్‌బాస్,మెలిటొపోల్ డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్ లాంటి నగరాలను రష్యా సొంతం చేసుకొని తమ ఆధీనంలోకి తెచ్చుకోగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సొంతం చేసుకోవడంలో మాత్రం రష్యా ఎన్ని సార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమవుతూ వస్తుంది.
అయితే ఇరు దేశాల మధ్య ఇంకా యుధ్ధం లెక్కలు తేలని ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంకొంత కాలంలో చనిపోతారన్న వార్త నెట్టింట సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే ఉక్రెయిన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిలొ బుడనోవ్ ను అమెరికాకు చెందిన ఏబీసీ న్యూస్ ఇటీవల ఇంటర్వ్యూ చేసింది. కాగా ఈ ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక సంచలన ప్రకటన చేశారు.
వ్లాదిమిర్ పుతిన్ చావు బతుకుల్లో ఉన్నారని,ఆయన ఎంతో కాలం బతకరని ఆయన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కి అసలు ఏమైందని ఆయనను ప్రశ్నించగా పుతిన్ ప్రమాదకరమైన కేన్సర్ తో బాధపడుతున్నారని, యుద్ధం ముగిసే లోపు ఆయన మరణించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని కిరిలొ బుడనోవ్ పేర్కొన్నారు.
పుతిన్ కు సన్నిహితుల నుంచి తమకు ఈ సమాచారం తెలిసిందని ఆయన వివరించారు.మరణానంతరం రష్యాలో అధికార మార్పిడి జరుగుతుందని అన్నారు. రష్యా త్వరలోనే కొత్త నాయుకుడి చేతిలోకి వెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే కొంత కాలం నుంచి పుతిన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని చాలా మంది చాలా చోట్ల రకరకాలుగా చెప్తుండగా..పుతిన్ అనారోగ్యంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారికంగా ప్రకటన రాకపోవడం విశేషం.
ఇది ఇలా ఉండగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పుతిన్ చనిపోతే తరువాత నాయుకుడు ఎవరు అవుతారని కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరో పక్క ఉక్రెయిన్ లో తీసిన ప్రాణాలకు, కలిగించిన బాధకు ఆయన అనుభవించి ప్రాణాలు వదులుతారని ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.
"Putin is terminally ill. He will die before the war ends and there will be a transfer of power" – Kyrylo Budanov, Ukrainian Head of Military Intelligence in an interview with @BrittClennett of @ABC pic.twitter.com/L219NIHrhW
— Anton Gerashchenko (@Gerashchenko_en) January 4, 2023
Also read :
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించిన కొన్ని ఆసక్తికర అంశాలు