రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా 81 క్షిపణులతో రష్యా సైన్యం విరుచుకుపడింది. ఫలితంగా అణువిద్యుత్ కేంద్రానికి పవర్ కట్ అయ్యింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ దేశ డిఫెన్స్ మినిస్ట్రీ నిర్ధారించింది. 34 క్షిపణులను, షాహిద్ డ్రోన్లను కూల్చివేసినట్లు పేర్కొంది. రష్యా ల్వీవ్ ప్రాంతంపై చేసిన రాకెట్ దాడిలో ఐదుగురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఇక డెనిప్రోపెట్రోవస్క్ పై జరిగిన క్షిపణి దాడుల్లో ఒక వ్యక్తి దుర్మరణం చెందినట్లు సమాచారం.
జపోరిజియా అణు విద్యుత్ కేంద్రానికి ఉక్రెయిన్ కరెంటు సరఫరా వ్యవస్థకు మధ్య కమ్యూనికేషన్ కట్ అయ్యింది. ఈ కేంద్రం వద్ద దాడి జరగడంతో అణువిద్యుత్ కేంద్రానికి పవర్ కట్ అయిపోయింది. ఈ విషయాన్ని అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఎనర్గో ఆటమ్ ఉద్యోగి ధ్రువీకరించారు. మాస్కో ఆధీనంలోని జపోరిజియా నగరంలో రష్యా అధికారులు పర్యటించారు. ఈ అణు విద్యుత్ కేంద్రానికి ఉక్రెయిన్ కరెంటు సప్లయ్ ఆపేయడం కవ్వింపు చర్య అవుతుందన్నారు.
ఈఏడాదిలో జనవరిలో జరిగిన దాడి తర్వాత నేడు జరిగింది అతి పెద్ద దాడిగా చెబుతున్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ యుద్ధాన్ని కొన్నేళ్ల పాటు సాగదీసే చాన్స్ ఉందని అమెరికాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆవ్రియల్ హైనస్ వ్యాఖ్యానించారు. అయితే, భారీ దాడులు చేసే కెపాసిటీ లేదని పేర్కొన్నారు. ఇక రష్యా మిలటరీ పుంజుకొనేందుకు యూఎస్ సహకరించదని, పుతిన్ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తాడని వెల్లడించారు. గ్యాప్ ఇచ్చి యుద్ధం చేయడమే రష్యా ఎదుట ఉన్న మార్గమని ఆమె చెప్పారు. బక్ముత్ నగరంపై ఆధిపత్యం కోసం కొన్ని నెలలుగా రష్యా సైన్యం పోరాడుతోంది. ప్రస్తుతం ఈ నగరంపై పట్టు సాధించింది.
also read :
Naveen Murder Case : సంచలన విషయాలు బయటపెట్టిన నిహారిక.. నవీన్ హత్య కేసు ఫుల్ స్టోరీ..
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామాలు.. న్యాయం, ధర్మం తమవైపే ఉన్నాయన్న కవిత