Telugu Flash News

rushika raj : బాహుబలిలో అనుష్క డూప్‌గా ఈ హీరోయిన్ నటించిందా?

rushika raj as anushka in bahubali

rushika raj : ప్రభాస్‌ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మ‌నంద‌రికి తెలిసిందే. బాహుబలికి తోడుగా ఉన్న కట్టప్ప చివరికి అతన్ని చంపడం ‘బాహుబలి’ రెండో భాగంపై ఆస‌క్తిని పెంచింది. ఈ సినిమాలో హీరోలు ప్రభాస్, రానా, హీరోయిన్స్ అనుష్క, తమన్నా, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ వంటి స్టార్స్ న‌టించారు.

అయితే చిత్రంలో అనుష్క డీగ్లామర్ రోల్ లో చాలా బాగా నటించిందన్న ప్ర‌శంస‌లు ల‌భించాయి.. భళ్లాలదేవ దేవసేనను సంకెళ్లతో బంధించి చిత్రహింసలు పెడుతుంటే.. ఆమె మాత్రం తన సంకెళ్లను తెంచడానికి తన కొడుకు వస్తాడని చెబుతూ ఉంటుంది.అంతేకాదు భళ్లాలదేవ కోసం పుల్లలు ఏరుతూ చితి పేరుస్తుంటుంది.

rushika raj

అయితే ఈ సన్నివేశంలో అనుష్కకు డూప్ గా హీరోయిన్ రుషిక రాజ్ న‌టించింద‌ని తెలుస్తుంది. లాంగ్ షాట్స్ లో అనుష్కలా కనిపించేది అనుష్క కాదు అని, ఆమె రుషిక రాజ్ అని అంటున్నారు. అనుష్క, రుషిక రాజ్ దూరం నుంచి చూస్తే ఇద్దరూ ఒకేలా ఉంటారు. వీరిద్దరూ ఎత్తు, రంగు ఒకేలా ఉండడంతో గుర్తుపట్టడం కూడా కష్టం. మాసిన చీరలో ఉన్న సన్నివేశాల్లో అనుష్క డూప్ గా రుషిక రాజ్ నటించి మెప్పించింది. ప్ర‌స్తుతం ఆమెకు సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది.

also read :

Chalaki Chanti: తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌తో ఆసుపత్రిలో చేరిన చ‌లాకీ చంటీ.. ఐసీయూలో చికిత్స‌..!

Exit mobile version