Telugu Flash News

oscar award for naatu naatu : నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డ్.. దేశం మీసం మెలేసిన ఆర్ఆర్ఆర్..

naatu naatu song

oscar award for naatu naatu : ప్ర‌తి తెలుగు వాడు గ‌ర్వ‌ప‌డే క్ష‌ణం. తెలుగు ప‌దాల‌తో కూడిన నాటు నాటు పాట‌కి ఆస్కార్ అవార్డ్ లభించింది. జ‌క్క‌న్న అండ్ టీంకి జ‌య‌హో చెప్పాల్సింది. ఎన్నో ద‌శాబ్ధాల నుండి తెలుగు వాడు ఆస్కార్ కోసం ఎదురు చూస్తుండ‌గా, ఎట్ట‌కేల‌కు ఆర్ఆర్ఆర్ లోని నాటునాటు పాట‌తో ఆస్కార్ ద‌క్క‌డం ప‌ట్ల ప్ర‌తి తెలుగు వాడు మీసం మెలేస్తున్నాడు. ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరిలో ఆస్కార్ ద‌క్కించుకున్నారు. చంద్ర‌బోస్, కీర‌వాణి ఈ అవార్డ్ అందుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా అంబ‌రాలు మిన్నంటాయి. సినీ ప్ర‌ముఖులు, అభిమానులు వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

నాటు నాటు తో పాటు ‘టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌’ నుంచి ‘అప్లాజ్‌’, ‘టాప్‌ గన్‌ మెవరిక్‌’ నుంచి ‘హౌల్డ్‌ మై హ్యాండ్‌’, ‘ఎవ్రీ థింగ్‌ ఎవ్రీ వేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ నుంచి ‘దిస్‌ ఈజ్‌ ఏ లైఫ్‌’, ‘బ్లాక్‌ పాంథర్‌’ నుంచి ‘లిఫ్ట్‌ మీ అప్‌’ పాటలు కూడా ఆస్కార్‌ బరిలో నిల‌వ‌గా, వాట‌న్నింటిని ప‌క్క‌కు నెట్టి నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది.

అంత‌క‌ముందు హాలీవుడ్ డాన్సర్లు నాటు నాటు పాట‌కు చిందులేశారు. ఈ పాట ప్రదర్శిస్తున్నంత సేపు కరతాళ ధ్వనులతో థియేటర్ హోరెత్తిపోయింది. మొత్తానికి ఆస్కార్ అంద‌ని ద్రాక్ష‌గా మిగిలిన మ‌నకు ఆర్ఆర్ఆర్ అవార్డ్ తెచ్చిపెట్టింది.

also read :

Naatu Naatu at Oscars 2023 : ఆస్కార్ వేదిక‌పై నాటు నాటు ప్ర‌ద‌ర్శ‌న‌.. వీడియో

 

Exit mobile version