HomecinemaRRR: ఆస్కార్ అవార్డ్ ఫంక్ష‌న్‌కి చిత్ర నిర్మాత వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌

RRR: ఆస్కార్ అవార్డ్ ఫంక్ష‌న్‌కి చిత్ర నిర్మాత వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌

Telugu Flash News

RRR: తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డ్ ద‌క్క‌డంతో చిత్ర బృందం ఫుల్ ఖుష్ అవుతుంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను మన దేశం నుంచి అధికారికంగా ఆస్కార్‌కు పంపకపోయినా.. ప్రైవేట్‌గా వెళ్లి.. పట్టుబట్టి మరీ ఆస్కార్‌ను ఇండియా తీసుకు వ‌చ్చేందుకు కృషి చేశారురాజమౌళి. ఇక ఆస్కార్‌ అవార్డు ప్రధానం సందర్బంగా నాటు నాటు పాటతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు న్యూయార్క్‌లో తెగ సందడి చేశారు.

చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు, హెచ్‌సీఏ అవార్డులు అందుకునే సందర్భంలో కూడా దానయ్య మ‌నకు కనిపించ‌లేదు. అయితే ఏం జ‌రిగింది అనే దానిపై తాజాగా స్పందించారు దానయ్య. ‘‘నేను ఆస్కార్స్‌ ఫంక్షన్‌కి వెళ్లకపోవడానికి అనేక‌ కారణాలు ఉన్నాయి. చిరంజీవి గారు డబ్బులు పెట్టాలనుకుంటే.. ఆయన సొంత సినిమాకు డ‌బ్బులు పెడతారు. అత‌నికి సొంతంగా నిర్మాణ సంస్థ ఉంది. ఆయ‌న అస‌లు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఎందుకు పెట్టుబడులు పెడతారు. ఇలాంటి పుకార్లు పుట్టించే వాళ్ల‌కు కాస్త అయినా బుర్ర ఉందా.. కామన్‌ సెన్స్‌ లేని వాళ్లే.. ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తారు. ద‌య‌చేసి ఇలాంటి పుకార్లు క్రియేట్‌ చేయొద్దని కోరుకుంటున్నాను అని దాన‌య్య స్ప‌ష్టం చేశారు.

also read :

సమ్మర్‌లో మీ ఇల్లు కూల్‌గా ఉండాలా? ఈ టిప్స్‌ మీకోసమే..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News