Telugu Flash News

RRR అభిమానుల‌కి నిరాశ‌.. ఆస్కార్ లిస్ట్‌లో ఒకే ఒక్క భారతీయ చిత్రం ‘Chhello Show’

RRR: ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ సినిమా రూపొంద‌గా, ఈ మూవీ దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రించింది.

సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పర్ఫామెన్స్ మీద అంతర్జాతీయ పత్రికలు ప్రశంసల వ‌ర్షం కురిపించాయి. ఇక‌ వెరైటీ మ్యాగజైన్ అయితే ఆస్కార్ రేసులో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కచ్చితంగా ఉంటారని కూడా క‌థ‌నం రాసింది. అయితే ఆ క‌థ‌నంతో మ‌నోళ్లు ఫుల్ ఖుష్ అయిపోయారు.

ఈ సారైన మ‌న వాళ్లకి ఒక్క ఆస్కార్ వ‌స్తుందేమోన‌ని క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తూ వ‌స్తున్నారు. కాని వ‌డపోతలోనే ఆర్ఆర్ఆర్ సినిమాను పక్కన పెట్టేశారు.

అభిమానుల‌కి నిరాశ‌..

మన వాళ్లే ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్లకు పంపించలేదు అని తెలుస్తుంది. దీంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు తీవ్రంగా హర్ట్ అవుతున్నారు. మంచి సినిమాల‌పై ఎందుకు ఇంత ప‌క్ష‌పాత దోర‌ణి చూపుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే భారత్ నుంచి ఈసారి గుజరాతీ చిత్రం ‘Chhello Show’ (ఆఖరాట) ఆస్కార్ కు వెళుతుంది. ద కశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను కాకుండా  ‘Chhello Show’ ఆస్కార్ చాన్స్ దక్కించుకోవడం ప‌ట్ల అంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ చిత్రం ఆస్కార్ లో ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో పోటీపడేందుకు సిద్ద‌మైంది.

ఛెల్లో షో చిత్రాన్ని గుజరాతీ దర్శకుడు పన్ నళిన్ డైరెక్షన్ తెర‌కెక్కించ‌గా, ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘లాస్ట్ ఫిల్మ్ షో’ పేరిట ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో కూడా ప్రదర్శితమైంది.

ఈ సినిమా ఇటాలియన్లో వచ్చిన సినిమా పారడిజో అనే చిత్రానికి రీమేక్‌గా రూపొంద‌గా, స్లమ్ములో పెరిగే చిన్న పిల్లాడు.. సినిమాతో ప్రేమలో పడటంపై ఈ సినిమాని చిత్రీక‌రించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్‌కి పంప‌క‌పోవ‌డంపై రాజ‌కీయ కోణం దాగి ఉందా అంటూ కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version