జబర్ధస్త్ షోతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న కమెడియన్ కిరాక్ ఆర్పీ(kiraak RP) కొద్ది రోజుల క్రితం జబర్ధస్త్ కామెడీ షో కి గుడ్ బాయ్ చెప్పి వేరే ఛానల్స్ కి వెళ్లారు.
అనంతరం సొంతంగా బిజినెస్ లోకి అడుగు పెట్టారు. ఇటీవల హైదరాబాద్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ప్రారంభించగా,దానికి ఊహించిన దానికన్నా ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారు.
అయితే ఈ మద్య తన ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ టేస్ట్ బాలేదని కొంతమంది పనికట్టుకొని లేని పోని రూమర్లు సృష్టిస్తున్నారని.. అదంతా పెయిడ్ బ్యాచ్ పనే అని అంటున్నాడు కిరాక్ ఆర్పీ.
తన జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని.. మోసం చేసి ఎన్నాళ్లు బిజినెస్ చేయలేనని.. తాను ఎంతో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాదు పెయిడ్ బ్యాచ్ కి తనదైన శైలిలో గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు కిరాక్ ఆర్పీ. నన్ను ఎవరూ బ్యాడ్ చేయలేరు. ఎంత నెగిటీవ్ చేస్తే.. నాకు అంత ప్రమోషన్ అంటున్నాడు కిరాక్ ఆర్పీ.
Also read: